twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : బాలయ్య-చిరు కలుసుకుంటారా?.. ఆ వేడుకపైనే అందరి కళ్లు!

    |

    తెలుగు ఇండస్ట్రీల్లో మెగా నందమూరి ఫ్యామిలీ మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. చిరంజీవి బాలకృష్ణ మాత్రం మీడియా ముందు సఖ్యంగానే కనిపిస్తారు. ప్రాణ స్నేహితులమని చెబుతారు. కెరీర్ స్టార్టింగ్‌లో చిరంజీవి తెలియదంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ అయితే ఓ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టించాయి. అన్నీ వివాదాలు సమసి పోయి రామ్ చరణ్-ఎన్టీఆర్ స్నేహంతో తమ ఇరు కుటుంబాలు ఒక్కటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా నెలకొన్న పరిస్థితులు మాత్రం ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా తయారయింది.

    బాలయ్య సంచలన కామెంట్స్‌...

    బాలయ్య సంచలన కామెంట్స్‌...

    సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు, షూటింగ్‌లు ప్రారంభం, థియేటర్ల పున: ప్రారంభంపై పెద్దలంతా నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వాలతో మాట్లాడం జరిగింది. ఈ విషయంలో చిరంజీవి చొరవ తీసుకున్న విషయం తెలిసింది. అయితే ఈ చర్చలకు తనను పిలవకపోవడంతో బాలయ్య హర్ట్ అయ్యాడు. ఇదే విషయం మీడియాతో మాట్లాడుతూ.. వారంతా భూములు పంచుకోవడానికి సమావేశం అవుతున్నారని కామెంట్స్ చేశాడు.

    బాలయ్యపై నాగబాబు ఫైర్..

    బాలయ్యపై నాగబాబు ఫైర్..

    బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు మండిపడ్డాడు. నోరు అదుపులో పెట్టుకోమని, మాటలు జాగ్రత్తగా రానీవ్వని హెచ్చరించాడు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదని ఫైర్ అయ్యాడు. నువ్వేమీ కింగ్‌వి కాదు, కేవలం ఒక హీరోవేనని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    బాలయ్య సైతం ఘాటుగా..

    బాలయ్య సైతం ఘాటుగా..

    బాలయ్య సైతం తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాటి విషయాలన్నీ తవ్వితీశాడు. మా బిల్డింగ్, ఐదు కోట్లు అంటూ అప్పటి సంగతులన్నీ మాట్లాడాడు. నాగబాబుపై కామెంట్స్‌పై తానేమీ మాట్లాడనని, అతనే ఏదేదో మాట్లాడుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు.

    పుట్టిన రోజు వేడుకలు..

    పుట్టిన రోజు వేడుకలు..

    జూన్ 10 బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఇప్పటికే కామన్ డీపీ అంటూ హల్చల్ మొదలైంది. అయితే ఈ సారి షష్టి పూర్తి వేడుకలు కూడా చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం పరిశ్రమలోని దగ్గరి వారిని ఆహ్వానించి అంగరంగ వైభవంగా ఈవెంట్ చేయాలని అనుకుంటున్నారట.

    Recommended Video

    Sri Reddy On Balakrishna-Nagababu Issue || ఆయన కింగే మీరే బొంగు... నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి
    చిరును ఆహ్వానిస్తారా?

    చిరును ఆహ్వానిస్తారా?

    అయితే ఈ వేడుకులకు చిరంజీవి ఆహ్వానిస్తారా? ఆహ్వానిస్తే చిరు వెళ్తారా? అనే ప్రశ్నలు ఇండస్ట్రీలో తలెత్తుతున్నాయట. ఇప్పటికే బాలయ్య కామెంట్స్ పట్ల చిరు తెగ ఫీల్ అయిపోతున్నాడని ఇన్ సైడ్ టాక్. ఒకవేళ ఈ ఈవెంట్‌లో ఈ ఇద్దరు కలిస్తే.. వివాదానికి పుల్ స్టాప్ పడ్డట్టు అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

    English summary
    NBK 60th Birthday Will Chiranjeevi Receive Invitation And Come To. Buzz is That NBK 60th Birthday Is Celebrated At Grandly. Will Chiranjeevi Receive Invitation To The event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X