NBK బర్త్ డే స్పెషల్ పిక్.. చిరు బాలయ్య ముచ్చట.. టాలీవుడ్ అంతా ఒకే చోట
టాలీవుడ్ హీరోలందరూ పిక్‌నిక్‌కు వెళ్లితే ఎలా ఉంటుంది. అందరూ హీరోలు కలిసి ఒకే చోట ఉంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి మూమెంట్స్ అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. అవార్డు ఈవెంట్స్, ఏదైనా ప్రత్యేకమైన వేడుకలు జరిగినప్పుడు అందరూ ఒకే చోట కనబడే వీలుంటుంది. అయితే బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా చక్కర్లు కొడుతున్న ఓ ఆర్ట్ మాత్రం నిజ జీవితంలో జరగకపోవచ్చు గానీ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది.

అందర్నీ ఒకేచోట..
టాలీవుడ్ హీరోలందరూ ఏదో ఒక సందర్భంలో ఇచ్చిన స్టిల్‌ను క్యారికేచర్‌గా మలిచి బాలయ్య బర్త్ డే వేడుకలో పాల్గొన్నట్టుగా మలిచాడు. దీంట్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని, రామ్, నితిన్, మంచు మనోజ్, రానా, శర్వానంద్ వంటి హీరోలందరూ ఉన్నారు.

కోడి రామకృష్ణ కూతురి నిశ్చితార్థం..
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం వేడుకలో చిరు బాలయ్యలు ఒకే చోట కూర్చుని ముచ్చటించిన సంగతి తెలిసిందే. చిరు ఫోన్ చూపిస్తూ ఉండగా.. బాలయ్య ఏదో చెబుతున్న ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆదే ఫోటోను ఇప్పుడు క్యారికేచర్‌గా మలిచాడు.

బాలయ్య బర్త్ డే వేడుకలా..
అయితే వీటన్నంటికి బాలయ్య బర్త్ డే కేకును కలపడంతో కొత్త వెలుగు వచ్చింది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్-జూ ఎన్టీఆర్ వంట చేస్తున్నట్టుగా గతంలోని వారి స్టిల్స్ ఆధారంగా చిత్రీకరించాడు. అయితే చిరు బాలయ్యలను చూస్తే ముందున్న ఆ కేక్‌ను కట్ చేసి తినిపించినట్టుగా భ్రమకలుగుతుంది.
Recommended Video

వివాదాలు రావడంతో..
ఈ మధ్య బాలయ్య, చిరంజీవికి మధ్య గాప్ రావడంతో ఓ అభిమాని ఇలా తన ప్రతిభతో ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని చాటి చెప్పాడనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ పిక్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. నిజంగా ఇలాంటి మూమెంట్ వస్తే ఎంత బాగుంటుందో అని సంబరపడుతున్నారు.


Click it and Unblock the Notifications











