అందుకే గర్భం దాల్చిన విషయం రహస్యంగా ఉంచిందట!

Recommended Video

Neha Dhupia Talks About Her Pregnancy

బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా నటుడు అంగద్ బేడీని ఈ ఏడాది మే నెలలో పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి తంతు పూర్తయ్యే వరకు ఈ విషయం సీక్రెట్‌గానే ఉంచారు. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన తర్వాతే వీరి పెళ్లి గురించి అందరికీ తెలిసింది. అత్యంత రహస్యంగా జరిగిన వీరి పెళ్లిపై అప్పట్లో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా ఉన్నట్టుండి పెళ్లి పీటలు ఎక్కడానికి కారణం ఇద్దరూ పెళ్లికి ముందే కాలు జారారని, నేహా గర్భం దాల్చిందని.... ఈ విషయం బయటకు పొక్కక ముందే రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఆ తర్వాత నిజమే అని తేలింది

ఆ తర్వాత నిజమే అని తేలింది

పెళ్లి సమయంలో వచ్చిన ఈ వార్తలను నేహా తల్లి దండ్రులు ఖండించినా.... కొన్ని రోజుల తర్వాత ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చిన విషయం నిజమే అని తేలిపోయింది. అపుడు గర్భం దాల్చిన విషయం ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందో కూడా నేహా వివరణ ఇచ్చారు.

అందుకే భయం వేసింది

అందుకే భయం వేసింది

అపుడు నాకు గర్భం వచ్చిన విషయం తెలిస్తే నాకు సినిమా ఆఫర్లు రావని భయం వేసింది. నా గర్భం ఆరో నెల వచ్చే వరకు బయకు పెద్దగా కనిపించలేదు. అదృష్ట వశాత్తు నాలో అపుడు నటించే శక్తి కూడా ఉంది. కానీ ఒకరోజు రాత్రి నేను కొంత కాలం పాటు పనికి దూరంగా ఉండాలనే విషయం అర్థమైంది.' అని నేహా ధూపియా తెలిపారు.

గర్భంతోనే ఈ సినిమాలో నటించిందా?

గర్భంతోనే ఈ సినిమాలో నటించిందా?

బాలీవుడ్ నటతి కాజోల్‌తో కలిసి నేహా ధూపియా ‘హెలికాప్టర్ ఈలా' అనే సినిమాలో నటించింది. గర్భం దాల్చిన విషయం రహస్యంగా ఉంచి ఈ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 12న విడుదల కాబోతోంది.

నమ్మాల్సిందే మరి...

నమ్మాల్సిందే మరి...

‘జూలీ' సినిమాతో బాలీవుడ్లో తన కెరీర్ మొదలు పెట్టిన నేహా ధూపియా తొలి సినిమాలో బోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో సంచలనం క్రియేట్ చేసింది. తర్వాత హీరోయిన్‌గా ఎదగలేక పోయినా... నటిగా రాణిస్తోంది. నేహా ధూపియా గర్బం విషయంలో మీలో ఎన్ని అనుమానాలు ఉన్నా.... అసలు విషయం ఇదే అని నేహా చెప్పింది కాబట్టి నమ్మాల్సిందే!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X