పవన్, మహేష్ సినిమాల ఫైట్ సీన్స్.. నెల్లూరు కుర్రాళ్ళ బడ్జెట్ ఎంతో తెలుసా?

సినిమా మేకింగ్ అనేది ఈ రోజుల్లో చాలా సహనంతో కూడుకున్న పని. అప్డేర్ అవుతున్న కాలంలో ఒక సినిమా కోసం ఏళ్ళ తరబడి కష్టపడాల్సి వస్తోంది. అందరికి నచ్చేలా యాక్షన్ సినిమా తీయాలి అంటే కేవలం ఇష్టం ఉంటే సరిపోదు. కష్టపడే సహనం కూడా ఉండాలి. ఇక ఈ మధ్య కాలంలో కొంతమంది సినిమా మీద ఇష్టంతో యూ ట్యూబ్ లో చేస్తున్న కవర్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక కొంతమంది కుర్రాళ్ళు యాక్షన్ సీన్స్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్నారు.

రెండు రోజుల్లోనే

రెండు రోజుల్లోనే

నెల్లూరు కుర్రాళ్ళ గురించి అందరికి తెలిసిందే. గత ఏడాది నుంచి సోషల్ మీడియాలో వీరు కంపోజ్ చేస్తున్న సినిమా ఫైట్స్ కు భారీ రెస్పాన్స్ వస్తోంధి. ఉన్నది ఉన్నట్లు కాకుండా కాస్త కొత్తగా ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా షూటింగ్స్ లలో రెండు వారాలు కష్టపడితే వీళ్ళు మాత్రం రెండు రోజుల్లోనే కంపోజ్ చేస్తున్నారు.

మాకు ఉన్న పరిధిలో మాత్రమే

మాకు ఉన్న పరిధిలో మాత్రమే

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నెల్లూరు కుర్రాళ్ళు వారికి సంబంధించిన బడ్జెట్ వివరాలను మేకింగ్ గురించి క్లుప్తంగా వివరించారు. నిజానికి సినిమా రేంజ్ లో అయితే మేము తీయలేదు అంటూ వాళ్ల కష్టాన్ని మేము కాస్త భిన్నంగా చూపిస్తున్నామని చెబుతున్నారు. రెండు రోజుల్లో మాకు ఉన్న పరిధిలో మాత్రమే షూట్ చేయగలుగుతున్నామని చెప్పారు.

వాళ్ళతో పోల్చడం సరికాదు

వాళ్ళతో పోల్చడం సరికాదు

సినిమా అన్నప్పుడు చాలామంది చాలా రకాల పనులు చేయాల్సి ఉంటుంది. అందుకే మాకు వాళ్ళకే టైమ్ గ్యాప్ ఎక్కువగా ఉంటుందని మేము ఇది తొందరగా చేశాము అనడం వలన వాళ్ళతో పోల్చడం సరికాదని అన్నారు. మా టీమ్ లో ఇష్టంతోనే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నట్లు వివరణ ఇచ్చారు

కేవలం ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తోనే..

కేవలం ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తోనే..

వీరి వీడియోలు చూసిన తర్వాత ఎవరైనా సరే నిజమోమో అని అనుకుంటారు. కేవలం ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తోనే మ్యాజికల్ గా షూట్ చేస్తున్నారు. మొదట సరిలేరు నీకెవ్వరు రమణ ఫైట్ నుంచి వీరి ప్రయాణం వైరల్ అయ్యింది. ఆ వీడియోకు మిలియన్ల వ్యూవ్స్ రావడంతో వారికి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ తరువాత క్రాక్, వకీల్ సాబ్ ఫైట్ సీన్స్ కూడా అద్భుతంగా చేసి కొంతమంది సినీ ప్రముఖుల నుంచి కూడా పాజిటివ్ కామెంట్స్ అందుకున్నారు.

Recommended Video

Anandayya మందు పై గళం విప్పుతున్న Tollywood ప్రముఖులు || Filmibeat Telugu
ఖర్చు ఎంత అవుతుందంటే..?

ఖర్చు ఎంత అవుతుందంటే..?

అయితే సాధారణంగా వారి ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఎక్కువగా ఫైట్ లో ఉండేది పిల్లలు కాబట్టి ముందు వాళ్లకు నచ్చిన ఫుడ్ ఎక్కువగా తెప్పిస్తూ ఉంటామని చెప్పారు. ఇక అప్పుడప్పుడు ఏదైనా సామగ్రి అవసరం అయితే అద్దెకు తెచ్చుకుంటామని చెప్పారు. సాధారణంగా ఒక్క షూటింగ్ కు 10 నుంచి 15 వేల వరకు అవుతుందని వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X