కింగ్ ఆఫ్ ఓటీటీ.. దుమ్ములేపిన నెట్‌ఫ్లిక్స్
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచం ఎంతగా దూసుకుపోతోందో అందరికీ తెలిసిందే. కరోనా, లాక్డౌన్ వల్ల ప్రపంచంలో ఓటీటీ హవా భారీగా పెరిగింది. మామూలుగానే వరల్డ్ వైడ్‌గా నెట్ ఫ్లిక్స్ సత్తా చాటుతుంది. పైగా లాక్డౌన్ కాలంలో ప్రపంచం అంతా కూడా నాలుగు గోడల మధ్యే ఉండిపోయింది. ఆ సమయంలో నెట్ ఫ్లిక్స్ మాత్రం దుమ్ములేపింది. మొత్తానికి ఇప్పటి వరకు 200 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ వచ్చారు. ఆసియాలోనే నెట్ ఫ్లిక్స్ అత్యధిక షేర్‌ను కొల్లగొట్టిందట.
గత ఏడాది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 9.3 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉండగా.. అందులో దాదాపు 65శాతం పెరుగుదల కనిపించింది. యూరోప్, ఆఫ్రికాలో 40 శాతంపెరిగితే, ఆసియాలో 62 శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఇండియా, సౌత్ కొరియా, జపాన్ వంటి దేశాల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఆయా దేశాలో నెట్ ఫ్లిక్స్ పెట్టుబడులు కూడా భారీగానే పెరిగాయి. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కింగ్ ఆఫ్ ఓటీటీగా దూసుకుపోతోంది.
శృంగారం ఒలకబోస్తున్న పార్వతీ నాయర్.. మీరు ఎప్పుడూ చూడని హాట్ ఫోటోలు

మూడేళ్ల క్రితం నెట్ ఫ్లిక్స్ సీఈవో మాట్లాడుతూ.. నెట్ ఫ్లిక్స్‌కు వంద మిలియన్ల మంది ఇండియా నుంచి వస్తారని అంచనా వేశారట. ఆసియాలో 2018 నుంచి 2020 వరకు 2 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టారట. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో మనీహీస్ట్ వంటి వెబ్ సిరీస్‌లు ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మనీహీస్ట్‌కు ప్రశంసల వర్షం కురిపించారు. నెట్ ఫ్లిక్స్ తరువాత అమెజాన్ వంటి ఓటీటీ సంస్థలు దూసుకుపోతోన్నాయి.


Click it and Unblock the Notifications











