twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2020లో ఉత్తమ చిత్రాల జాబితా: టాప్ -10లో టాలీవుడ్ నుంచి బన్నీ, సత్యదేవ్ సినిమాలు

    |

    కరోనా వైరస్ ప్రభావంతో సినిమా థియేటర్లు మొత్తం మూత పడిపోయాయి. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీల వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియాలో ఫేమస్ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఆల్ట్ బాలాజీ, ZEE5 సహా ఎన్నో సంస్థలకు చెందిన వాటి ద్వారా వినోదాన్ని పొందారు. దీంతో ప్రేక్షకులకు మజా, ఆయా సంస్థలకు లాభాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2020లో తమ సంస్థలో ఎక్కువ మంది చూసిన 10 సినిమాల జాబితాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో మన సినిమాలే రెండు ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం!

    Recommended Video

    Allu Arjun’s Ala Vaikunthapurramuloo in Top Of Netflix's TOP 10 Most Watched Films Of 2020
    టాప్ 10లో నెంబర్ వన్ స్థానంలో ‘అల'

    టాప్ 10లో నెంబర్ వన్ స్థానంలో ‘అల'

    త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. గత సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసింది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ తీసుకుంది నెట్‌ఫ్లిక్స్. అప్పటి నుంచి అందులో దీనికి విశేషమైన స్పందన వచ్చింది. ఫలితంగా 2020 ఉత్తమ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

    రెండో స్థానంలో దుల్కర్ సల్మాన్ మూవీ

    రెండో స్థానంలో దుల్కర్ సల్మాన్ మూవీ

    దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా'. తెలుగులో ఇది ‘కనులు కనులను దోచాయంటే'గా విడుదలైంది. దేసింగ్‌ పెరియసామి తెరకెక్కించిన ఈ సినిమాను వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన లిస్టులో ఇది రెండో స్థానాన్ని సంపాదించింది.

    మూడో స్థానంలో మలయాల సినిమా

    మూడో స్థానంలో మలయాల సినిమా

    2020 సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ క్లిక్కులు వచ్చిన చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది మలయాళ చిత్రం ‘కప్పెల'. మహమ్మద్‌ ముస్తఫా దర్శకత్వంలో రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్నా బెన్, శ్రీనాథ్ బాసీ సహా పలువురు నటించారు. ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు.

    నాలుగో స్థానంలో మరో తెలుగు చిత్రం

    నాలుగో స్థానంలో మరో తెలుగు చిత్రం

    విలక్షణ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో సత్యదేవ్. అతడు ‘కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకట్ మహా దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య'. శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మించిన ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. అక్కడ భారీ స్థాయిలో స్పందనను అందుకున్న ఈ చిత్రం నాలుగో స్థానంలో నిలిచింది.

    మిగిలిన స్థానాల్లో బాలీవుడ్, వెబ్ సిరీస్‌లు

    మిగిలిన స్థానాల్లో బాలీవుడ్, వెబ్ సిరీస్‌లు

    నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన జాబితాలో దక్షిణ భారతదేశం నుంచి నాలుగు సినిమాలు చోటు దక్కించుకోగా, మిగిలిన ఆరు స్థానాల్లో బాలీవుడ్ చిత్రాలు, హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు నిలిచాయి. జాన్వీ కపూర్ నటించిన ‘గుంజాన్ సక్సేనా'కు కూడా భారీ స్థాయిలో క్లిక్స్ వచ్చి టాప్‌-5లో నిలిచింది. ఆ తర్వాత ‘మసాబా మసాబా', ‘బుల్‌బుల్', ‘షీ' సహా పలు చిత్రాలు ఉన్నాయి.

    English summary
    Allu Arjun’s Ala Vaikunthapurramuloo, Dulquer Salman’s Kannum Kannum Kollaiyadithaal, Anna Ben's Kappela, and Satyadev's Uma Maheswara Ugra Roopasya were among the top 10 most watched films from south India in 2020, according to Netflix.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X