twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెట్‌ఫ్లిక్స్‌ ఉచితంగా.. ఎన్ని రోజులు.. ఎప్పటి నుంచి అంటే..

    |

    లాక్‌డౌన్ కాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ప్రేక్షకాదరణ పెరగడంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. కొత్త ఖాతాదారులను ఆకర్షించడానికి కొత్త ప్రణాళికతో ముందుకొస్తున్నది. ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ఖాతాదారులను పెంచుకొనేందుకు ప్లాన్ చేసింది. భారతదేశంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సదుపాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకొన్నది. నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడు? ఎన్ని రోజులు ఉచిత సేవలకు సిద్దమవుతున్నదంటే..

    గతంలో 30 రోజులు ఉచితంగా

    గతంలో 30 రోజులు ఉచితంగా

    గతంలో నెట్‌ఫ్లిక్స్ కొత్త ఖాతాదారులకు 30 రోజులుపాటు ఉచితంగా ఉపయోగించుకొనే అవకాశాన్ని కల్పించేది. అయితే అలాంటి ఆఫర్‌ను కొద్ది నెలల క్రితం నెట్‌ఫ్లిక్స్ ఆపేసింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అంతేకాకుండా మిగితా ఓటీటీ ఫ్లాట్‌ఫాంతో పోల్చుకొంటే రేటు కూడా భారీగానే ఉంది. దాంతో ఇతర ఓటీటీలకు యూజర్లు షిప్ట్ అవ్వడం జరిగిందనే విషయం తాజా సర్వేలో తెలింది.

    ప్రత్యర్థి ఓటీటీల నుంచి భారీగా పోటీ

    ప్రత్యర్థి ఓటీటీల నుంచి భారీగా పోటీ

    ఇలాంటి పరిస్థితుల్లో గత కొద్దికాలంగా అమెజాన్, జీ5, డీస్నీ+హాట్‌స్టార్, ఆల్ట్ బాలాజీ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి విపరీతమైన పోటీ ఏర్పడింది. దాంతో సెప్టెంబర్ త్రైమాసిక కాలానికి వృద్ధి రేటు గణనీయంగా పడిపోవడంతో యూజర్ బేస్‌ను పెంచుకొనే ప్రయత్నంలో పడింది.

    అమెజాన్ టారిఫ్ ఇలా..

    అమెజాన్ టారిఫ్ ఇలా..

    అమెజాన్ సంవత్సరానికి 999 రూపాయల వసూలు చేస్తుంటే. డిస్నీ+హాట్‌స్టార్ ఏడాదికి 369 రూపాయాలు వసూలు చేస్తున్నది. నెట్‌‌ఫ్లిక్స్ విషయానికి వస్తే.. నెలకు 199 రూపాయల నుంచి 799 వరకు వసూలు చేయడం గమనార్హం. ఇలాంటి టారిఫ్‌ మధ్య తరగతి వారికి అందుబాటులో లేవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    నెట్‌ఫ్లిక్స్‌లో ప్లాన్స్ ఇలా..

    నెట్‌ఫ్లిక్స్‌లో ప్లాన్స్ ఇలా..

    నెట్‌ఫ్లిక్స్‌ కోసం 199 చెల్లిస్తే.. మొబైల్ గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. నెలకు 499 రూపాయలు చెల్లిస్తే.. ఫోన్, ట్యాబ్, పీసీ, స్మార్ట్ టీవీలలో ఏదైనా ఒక్కదానిలో స్ట్రీమింగ్ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఇక 649 లేదా, 799 రూపాయలు చెల్లిస్తే.. ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ సాధనాల్లో వాడుకోనే అవకాశం కల్పిస్తున్నది.

    డిసెంబర్ నుంచి మళ్లీ ఉచితంగా

    డిసెంబర్ నుంచి మళ్లీ ఉచితంగా

    ఇలాంటి రేట్ టారిఫ్‌తో నెటిఫ్లిక్స్‌కు ఖాతాదారులు కొంత మేరకు దూరమయ్యారనే వాదన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో కొత్తగా ఖాతాదారులను రప్పించే ప్రయత్నాలు చేస్తూ.. యూజర్లకు 48 గంటలపాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను వాడుకొనే ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌తోపాటు మరికొన్ని సౌకర్యాలను యూజర్లకు అందించే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఆఫర్ డిసెంబర్ 4 నుంచి మొదలవుతుందని కంపెనీ సీఈవో గ్రెగ్ పీటర్స్ తెలిపారు.

    English summary
    Netflix targets new subscribers amid low numbers registed for September quarter. The Streaming company decides that Its going providing free trials in India. From December 4th of this year, Netfilix will offer 48 hours free trials.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X