For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రోజా కూతురికి ప్రపోజ్ చేసిన కుర్రాడు: ఆమె నుంచి ఊహించని రియాక్షన్.. హీరోయిన్ అవుతావా అనగానే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తమ తమ కాలాల్లో హవాను చూపించి స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. అలాంటి వారిలో సీనియర్ నటి రోజా ఒకరు. ఆకట్టుకునే అందం, అద్భుతమైన అభినయంతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న ఆమె.. చాలా కాలం పాటు సత్తా చాటారు. ఇక, ఈ మధ్య బుల్లితెరపైనా సందడి చేసిన ఈ సీనియర్ హీరోయిన్.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో రోజా కూతురు అన్షుకు ఓ కుర్రాడు లవ్ ప్రపోజల్ పంపాడు. దీనికి ఆమె షాకింగ్ రియాక్ట్ అవడంతో పాటు సినీ ఎంట్రీపైనా క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  సుదీర్ఘ ప్రయాణం.. సెకెండ్ ఇన్నింగ్స్‌

  సుదీర్ఘ ప్రయాణం.. సెకెండ్ ఇన్నింగ్స్‌

  అప్పుడెప్పుడో వచ్చిన ‘సర్పయాగం' సినిమాతో రోజా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆరంభంలోనే అదరగొట్టేసి వరుస ఆఫర్లను అందుకున్నారు. ఇలా బడా హీరోలు అందరితోనూ నటించిన ఆమె.. స్టార్‌గా ఎదిగిపోయారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని సెకెండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. ఇందులోనూ మంచి మంచి పాత్రలను చేస్తూ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నారు.

  జబర్ధస్త్‌గా కెరీర్‌... అన్నింట్లో ఆమె

  జబర్ధస్త్‌గా కెరీర్‌... అన్నింట్లో ఆమె


  సినిమా పరంగా సత్తా చాటిన రోజా.. బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘మోడ్రన్ మహాలక్ష్ములు' అనే గేమ్ షోతో హోస్టుగా ఆరంగేట్రం చేసిన ఆమె... ఫేమస్ కామెడీ షో ‘జబర్ధస్త్'తో క్రేజ్ దక్కించుకున్నారు. మధ్యలో ఎన్నో షోలను హోస్ట్ చేసిన ఆమె... ఏడేళ్లుగా జబర్ధస్త్‌కు జడ్జ్‌గా కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ షోకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు.

  రాజకీయాల్లోనూ మార్క్ చూపింది

  రాజకీయాల్లోనూ మార్క్ చూపింది

  సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న సమయంలోనే రోజా రాజకీయాల్లోకీ కూడా ఎంటర్ అయ్యారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఈ హీరోయిన్.. కొన్నేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన నియోజకవర్గ అభివృద్ధి చూసుకుంటూనే.. కెరీర్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నారు.

  రోజాకు సర్జరీ.. అన్నింటికీ విరామం

  రోజాకు సర్జరీ.. అన్నింటికీ విరామం

  రోజా.. ఓ వైపు గ్లామర్ ఫీల్డులో బిజీగా ఉంటూనే.. మరోవైపు రాజకీయాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో ఆమె తీరక లేని షెడ్యూల్‌ను గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఆమెకు ఓ సర్జరీ జరిగింది. దీంతో రాజకీయాలతో పాటు షోలకు బ్రేకిచ్చారామె. వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రోజా.. కొద్ది రోజుల్లో తన పనులతో బిజీ కానున్నారు.

  రోజా కూతురిపై ఫోకస్.. హీరోయిన్‌

  రోజా కూతురిపై ఫోకస్.. హీరోయిన్‌


  ఈ మధ్య కాలంలో రోజా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇందులో భాగంగానే తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను అందులో పోస్ట్ చేస్తున్నారు. వాటిలో రోజా కూతురు అన్షుమాలిక స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. చూడ్డానికి అచ్చం రోజాలానే కనిపించే ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది. దీంతో హీరోయిన్ అవబోతుందన్న టాక్ వినిపిస్తోంది.

  రోజా కూతురికి నెటిజన్ లవ్ ప్రపోజ్

  రోజా కూతురికి నెటిజన్ లవ్ ప్రపోజ్

  అన్షుమాలిక కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెకు స్పానిష్ ‘నేను నిన్న ప్రేమిస్తున్నాను' అని ప్రపోజ్ చేశాడు. దీనికి ఆమె కూడా అదే భాషలో ‘ఐ లవ్ యూ.. థ్యాంక్స్' అంటూ ఊహించని విధంగా రిప్లై ఇచ్చింది. ఈ స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి.

  హీరోయిన్ అవుతావా అనగానే ఇలా

  హీరోయిన్ అవుతావా అనగానే ఇలా

  ఇదే సెషన్‌లో మరో నెటిజన్.. ‘మీరు హీరోయిన్ అవుతారా? లేదా' అని ప్రశ్నించాడు. దీనికి అన్షుమాలిక స్పందిస్తూ.. ‘ఈ ప్రశ్న నాకు చాలా సందర్భాల్లో ఎదురైంది. ఎప్పుడైనా దానికి సమాధానం ‘నాకు తెలీదు' అనే చెబుతాను. నేను ఇప్పటి వరకూ అలాంటి ఆలోచనే చేయలేదు' అంటూ బదులిచ్చింది. ఇవే కాదు.. ఈ సెషన్‌లో తనకు సంబంధించిన ఎన్నో విషయాలపై వివరణ ఇచ్చింది.

  English summary
  R. K. Roja is an Indian politician and film actress. She was a leading actress in Tamil and Telugu films from 1991 to 2002. She has also acted in a few Kannada and Malayalam-language films. In 1999 she entered into politics and currently aligns with the Yuvajana Sramika Rythu Congress Party.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X