twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ బతికి ఉంటే ఈ రోజు ఏం చేసేవారో తెలుసా? కలలను కాలరాచిన హత్య అంటూ.. ట్వీట్స్ హోరు!

    |

    బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినా అతడి గురించి ప్రస్తావన గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఏ సినీ ప్రముఖుడైనా మరణిస్తే ఒకట్రెండు రోజులు ఆయన గురించి మాట్లాడుకోవడం, శ్రద్దాంజలి ఘటించడం ఆ తర్వాత రెగ్యులర్ పనిలో పడిపోవడం జరుగుతుంటాయి. కానీ సుశాంత్ మరణం ఎందరిలో ఎంతో ఆవేదనను పెంచింది. సుశాంత్ సూసైడ్‌ను ఇంకా జీర్ణించుకోలేకపోతూ ఆయన కేసును నిజాయితీగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో #BeFairInSSRMurderCase ట్రెండింగ్ అవుతున్న నేపథ్యంలో..

    Recommended Video

    Sushant Singh Rajput: Netizens Demands Be Fair In Sushant Case| #BeFairInSSRCase
    సూసైడ్ కాదు.. బంధుప్రీతి చేసిన హత్య

    సూసైడ్ కాదు.. బంధుప్రీతి చేసిన హత్య

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. యువ హీరో మరణం తర్వాత ఆయనది ఆత్మహత్య కాదు.. కొందరు చేసిన బంధుప్రీతితో సామూహిక హత్య అంటూ పలువురు సినీ ప్రముఖులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు సుశాంత్ కేసును నిజాయితీగా దర్యాప్తు చేయాలని ట్వీట్లు చేస్తూ ఆయనను గుర్తు చూసుకొంటున్నారు.

     సూర్య గ్రహణం రోజున సుశాంత్

    సూర్య గ్రహణం రోజున సుశాంత్

    ఈ రోజు సూర్యగ్రహణం. సుశాంత్ సింగ్ బతికి ఉంటే తన వద్ద ఉన్న విలువైన టెలిస్కోప్‌ నుంచి గ్రహణం చూసి ఉండేవాడేమో. కానీ దురదృష్ట వశాత్తూ మన మధ్యలేకుండా పోయాడు. కనీసం ఆయన కేసునైనా నిజాయితీ దర్యాప్తు చేసి మర్డర్ కుట్రలను బయటపెట్టాలి అంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.

     గొప్ప విషయాలు బయటకు వస్తున్నాయ్

    గొప్ప విషయాలు బయటకు వస్తున్నాయ్

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు బయటకు వస్తున్నాయి. అదే ఆయన బతికి ఉంటే బాలీవుడ్ చేసే కుట్రలు మాత్రమే మనకు తెలిసేవి. సినీ పరిశ్రమ వ్యవస్థలోనే ఏదో గందరగోళంలో ఉంది. బాలీవుడ్‌లో ఇతరుల మీద చీప్‌గా విసిరే గాసిప్స్‌కు అంతం పలకాలి అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

    7 రోజులైనా మరిచిపోలేకపోతున్నాం

    7 రోజులైనా మరిచిపోలేకపోతున్నాం

    సంతోషంగా, ఉల్లాసంగా ఉండే సుశాంత్ ఈ రోజు సూర్యగ్రహణాన్ని చూసి ఎంత ఆనందించేవారనే విషయాన్ని ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. సూర్య గ్రహణాన్ని చూసి ఎంత ఉత్సాహంగా ఉండేవారో. మనలో చాలా మంది సుశాంత్‌ను మరిచిపోలేకపోతున్నాం. ఆయన చనిపోయి 7 రోజులు అవుతున్నా.. ఆయన లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం. కనీసం మరణాంతరమైనా సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలి అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

     నెపోటిజం కారణంగా మేధావిని కోల్పోయాం

    నెపోటిజం కారణంగా మేధావిని కోల్పోయాం

    నెపోటిజం కారణంగా, సినీ ఇండస్ట్రీలో ఇన్‌సైడర్స్ వేధింపుల కారణంగా గొప్ప మేధావిని మనం కోల్పోవడం విషాదంగా మారింది. కాలం గడిచిన కొద్ది కర్మ వారిని తప్పకుండా వెంటాడుతుంది. సుశాంత్ కేసును కనీసం నిజాయితీగా దర్యాప్తు చేపట్టాలి అంటూ #BeFairInSSRMurderCase హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.

    కలలను కాలరాచిన హత్య

    కలలను కాలరాచిన హత్య

    సుశాంత్ సింగ్ కేసును నిజాయితీగా దర్యాప్తు జరపాలి. ఇది సూసైడ్ అయితే, ఈ సూసైడ్ మర్డర్.. కలలను కాలరాచిన హత్య, ఓ ప్రతిభను గొంతు నొక్కిన హత్య, హార్డ్ వర్క్‌ను తొక్కేసిన హత్య, సుశాంత్ మర్డర్ అసలు కారణం నెపోటిజం (బంధుప్రీతి) అంటూ నెటిజన్ల ఇలా ట్వీట్లతో హడలెత్తిస్తున్నారు. సుశాంత్ జరిగిన అన్యాయాన్ని బయటకు తీయాలి అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

    English summary
    Netizens demands Be Fair In Sushant Singh Rajput Murder Case goes trending on Twitter. People are trending #BeFairInSSRMurderCase.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X