ఇలాంటిది మొదటి సారిగా చూశాం.. దియా మీర్జా పెళ్లిపై నెటిజన్ల కామెంట్స్
సెలెబ్రిటీల పెళ్లిళ్లు మామూలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటిది అందులో వింతలు జరిగితే మరింతగా హైలెట్ అవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. పెళ్లి అంటే మామూలుగా పురోహితులు జరిపిస్తుంటారు. సాధారణంగా పురోహితులంటే మగవారే ఉంటారు. కానీ దియా మీర్జా పెళ్లిలో మాత్రం ఆడ పురోహితురాలి చేతుల మీదగా పెళ్లి జరిగింది.
Dia Mirza And Baibhav Rekhi Marriage Photos
ప్రస్తుతం దియా మీర్జా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆడ పురోహితులుండటంతో అందరూ షాక్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. సోమవారం దియా మీర్జా వైభవ్ రేఖిలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ మేరకు దియా మీర్జా ఓ పోస్ట్ చేసింది. ప్రేమ అనేది సంపూర్ణమైంది.. పెళ్లి అనేది ఓ అద్భుతమైందంటూ చెప్పుకొచ్చింది.

అయితే దియా మీర్జా షేర్ చేసిన ఫోటోలో ఆడ పురోహితులు ఉండటంతో.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఆడ పురోహితురాలు పెళ్లి చేయడం ఇదే మొదటి సారి.. అసలైన స్త్రీ వాది అంటే దియా మీర్జానే అంటూ ఆమె పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాగార్జున హీరోగా వస్తోన్న వైల్డ్ డాగ్ సినిమాలో దియా మీర్జా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దియా మీర్జా మొదటి వివాహాం 2019లో విడాకులతో ముగిసిపోయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











