Sana Javed సానియా మిర్జాకు అలా చీటింగ్..సనా జావెద్ అక్రమ సంబంధం బట్టబయలు.. దారుణంగా నెటిజన్లు ట్రోలింగ్
ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, షోయబ్ మాలిక్ దాంపత్య జీవిత వివాదం నేషనల్ మీడియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే సానియాతో విభేదాలు కొనసాగుతుండగానే.. పాకిస్థానీ నటి సనా జావెద్‌తో అక్రమ సంబంధాన్ని కొనసాగించారనే విషయం తాజాగా నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో బయటపెట్టారు. షోయబ్, సనా జావెద్ రొమాంటిక్ లైఫ్ విషయాల్లోకి వెళితే..
దుబాయ్‌లో సానియా మిర్జాతో వైవాహిక జీవితం కొనసాగిస్తూనే పాకిస్థాన్‌లో సనా జావెద్‌తో అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. అలాగే సనా జావెద్ కూడా మొదటి భర్తతో ఉంటూనే షోయబ్‌తో రొమాంటిక్ లైఫ్‌ను గడిపారనే విషయం పాత వీడియోల ద్వారా నెటిజన్లు బయటపెట్టారు. అయితే మూడో పెళ్లి తర్వాత ప్రస్తుతం సానియాతో విడాకులు తీసుకొనేందుకు షోయబ్ ప్రయత్నిస్తున్నారు.

పాకిస్థాన్‌లో కొద్ది రోజుల క్రితం షోయబ్, సనా జావెద్ ఓ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. ఆ సమయంలో వారిద్దరూ ఒకరికొకరు ప్రశంసలు అందుకోవడం కనిపించింది. సనా జావెద్‌ను గెలిపించేందుకు తాను ఓడిపోవడానికి సిద్దపడటం కనిపించింది. ఈ సందర్భంగా నన్ను గెలిపించడానికి షోయబ్ ఓడిపోవడానికి నిర్ణయించుకొన్నారు అని వీడియోలో సనా జావెద్ అనడం కనిపించింది.
అయితే వీరి అక్రమ సంబంధాన్ని హైలెట్ చేస్తూ.. సనా, షోయబ్ ఇద్దరూ తమ తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూనే.. ఒకరు తమ భర్తను, మరొకరు తన భార్యను చీటింగ్ చేశారు. ఇది అత్యంత దారుణం. వారిద్దరూ కూడా మానసికంగా చీటింగ్ చేసుకొంటున్నారు. సనా జావెద్ నీకు సిగ్గు లేదా? అని నెటిజన్లు ఈ సందర్భంగా వారిద్దరిని ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, తనను చీట్ చేసిన షోయబ్ తీరుపై సానియా మిర్జా మౌనంగా ఉన్నారు. అయితే మూడో పెళ్లి చేసుకొన్న మాజీ భర్తకు మంచి జీవితం ఉండాలని విషెస్ తెలియజేస్తూ హుందాగా వ్యవహరించారు. అయితే తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పటి మాదిరిగానే పబ్లిక్ లైఫ్‌కు దూరంగా పెడుతుండటం గమనార్హం.
ఇదిలా ఉండగా, సనా జావెద్ విషయానికి వస్తే.. పాకిస్థాన్ టెలివిజన్ రంగంలో సీరియల్ నటిగా కొనసాగుతున్నారు. పాకిస్థాన్ సినిమా రంగంలో కూడా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఓ టెలివిజన్ షో సందర్భంగా పరిచయమైన వారిద్దరూ అక్రమ సంబంధాన్ని కొనసాగించారని నెటిజన్లు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











