‘కోయిలమ్మ’ హీరో కేసులో కొత్త ట్విస్ట్: ఆధారాలతో సహా బయట పెట్టాడు.. ఆ యాంకర్ కొట్టిందంటూ!
'కోయిలమ్మ' సీరియల్ ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్నాడు బుల్లితెర హీరో అమర్ శశాంక. ఇందులో సెకెండ్ లీడ్‌గా చేసిన అతడు.. ఆ తర్వాత ఎన్నో ఆఫర్లను అందుకుంటున్నాడు. కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్న సమయంలో అతడిపై ఇటీవల ఓ కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలు హీరో అమర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. దీంతో ఈ న్యూస్ రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే దీన్ని జనాలు మర్చిపోతోన్న సమయంలో కొన్ని ఆధారాలతో అమర్ మీడియా ముందుకు వచ్చాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

సీరియల్ హీరో అమర్‌పై కేసు నమోదు
బుల్లితెరపై వరుస సీరియళ్లతో సత్తా చాటుతోన్న అమర్ శశాంక (కోయిలమ్మ ఫేం)పై హైదరాబాద్ మణికొండకు చెందిన ఇద్దరు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఓ రోజు రాత్రి అతడు తాగిన మైకంలో తమ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశాడని, అసభ్య పదజాలంతో దూషించాడని పేర్కొంటూ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు అమర్‌పై కేసు నమోదు చేశారు.

డబ్బుతో ముడిపెడుతూ అతడిపై కేసు
సదరు యువతులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు ఆసక్తికర విషయాలను సైతం వెల్లడించారు. అమర్‌కు తాము రూ. 5 లక్షలు అప్పుగా ఇచ్చామని, అవి తిరిగి చెల్లించమని అడిగినందుకే తమపై దౌర్జన్యం చేశాడని అందులో పేర్కొన్నారు. అతడితో పాటు మరో నలుగురు వ్యక్తులు దాడికి దిగినట్లు చెప్పారు. అంతేకాదు, అతడి నుంచి తమకు ప్రాణహాని కూడా ఉన్నట్లు ఆరోపిస్తున్నారు.

యువతులపై దాడి.... వీడియో వైరల్
అమర్ శశాంక తమపై దాడికి దిగినట్లు చెప్పిన ఇద్దరు యువతులు అందుకు తగిన వీడియోను పోలీసులకు అప్పగించారని ప్రచారం జరిగింది. అదే ఆ మధ్య ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొట్టింది. అందులో ఓ యువతి అమర్‌తో గొడవ పడినట్లు కనిపించింది. ఆ తర్వాత అతడు కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ రెండింటినీ మాత్రమే ఆ వీడియోలో చూపించారు.

ప్రియురాలిని కూడా తీసుకొచ్చేశారుగా
అమర్ కేసు జరిగిన సమయంలో అతడి ప్రియురాలిని కూడా ఇందులోకి లాగిన విషయం తెలిసిందే. బాధితులుగా పేర్కొన్న ఇద్దరు యువతులతో కలిసి ఆమె వ్యాపారం చేయాలని భావించిందని.. ఆ తర్వాత వీళ్ల మధ్య గొడవలు వచ్చాయని అన్నారు. ఈ కారణంగానే ఆ యువతులు ఆమెను డబ్బులు ఇవ్వమన్నారని, దీంతో ప్రియురాలి కోసం అమర్ ఎంటర్ అయ్యాడని ప్రచారం జరిగింది.

‘కోయిలమ్మ’ హీరో కేసులో కొత్త ట్విస్ట్
ఇద్దరు యువతులు పెట్టిన కేసుపై పోలీసులు అమర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు కూడా పంపించారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇది జరిగి చాలా రోజులు కావడంతో దీన్ని అందరూ మర్చిపోయారు. ఇలాంటి సమయంలో అమర్ మీడియా ముందుకు వచ్చాడు. అసలు ఆరోజు అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని వెల్లడించాడు. దీంతో కొత్త విషయాలు వెలుగులోకొచ్చాయి.

ఆధారాలతో సహా బయట పెట్టిన హీరో
అమర్ తాజాగా ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. 'ఆరోజు నేను తాగాను అన్నారు. కానీ, నా బ్లడ్ టెస్టు చూడండి. అసలు నేను తాగలేదు. అలాగే, లైంగిక వేధింపులు చేశానన్నారు. కానీ, నా మీద పోలీసులు పెట్టీ కేసు మాత్రమే నమోదు చేశారు. నా ఫ్రెండ్, ఆ అమ్మాయిలు వ్యాపారం చేద్దామనుకుని మానేశారు. ఆమె వస్తువుల కోసం వెళ్లినందుకే నాపై గొడవ చేశారు' అంటూ వివరించాడు.

ఆ యాంకర్ కొట్టిందంటూ షాకిచ్చాడు
'అక్కడకు వెళ్లగానే కొందరు మాపై గొడవకు దిగారు. వాళ్లలో ఓ రౌడీ షీటర్ కూడా ఉన్నాడు. బయటకు రానీయకుండా తలుపులు మూశారు. అప్పుడే ఓ న్యూస్ చానెల్ యాంకర్ నన్ను చెంపపై కొట్టింది. అదంతా వీడియో తీసి.. ఎడిట్ చేసి నేను గొడవ పడినవి మాత్రమే చూపించారు. నాపై చెడు వార్తలు ప్రసారం చేసిన వాళ్లంతా సంజాయిషీ చెప్పాలి' అంటూ అమర్ డిమాండ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











