బాత్రూంలోకి వెళ్తుంటే కూడా వదలడం లేదట.. నిధి అగర్వాల్ వీడియో వైరల్
ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాను బాగా వాడేస్తోంది. సోషల్ మీడియాలో అలా రచ్చ చేస్తూ ఉంటుంది కాబట్టే మొన్నా మధ్య అంత మంది జనాలు ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కొందరికి గాయాలు కూడా అయ్యాయి. చేసిన మూడు సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్ మిగతావి ఫట్. అయినా కూడా నిధి అందాలకు భారీ క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో నిధి ఓ రేంజ్‌లో ఫేమస్ అయింది.

ఇస్మార్ట్‌గా రచ్చ..
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధిలోని మరో కోణాన్ని ప్రేక్షకులు చూశారు. అందాల ఆరబోతలో నిధి ఏ మాత్రం తగ్గకపోవడంతో టాలీవుడ్ కళ్లు నిధిపై పడ్డాయి. అలా ఇస్మార్ట్ హీరోయిన్‌గా నిధికి బాగానే ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్, కోలీవుడ్‌లో నిధి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. లాక్డౌన్ సమయంలో నిధి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

అందాల వల..
నిధి అగర్వాల్ లాక్డౌన్‌లో నెటిజన్లకు అందాల వల వేసింది. వెరైటీ వెరైటీ ఫోటోలను షేర్ చేసింది. ఎద అందాలను చూపిస్తూ కాకపుట్టించింది. మిర్రర్ సెల్ఫీలంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. అలా నిధి లాక్డౌన్ మొత్తానికి బాగానే వాడుకుంది. ఎలాగూ తెరపై కనిపించడం లేదు కదా అని ఇలా సోషల్ మీడియాలో హంగామా చేసింది.

తాజాగా అలా..
నిధి అగర్వాల్ తాజాగా రాజమండ్రిలో రచ్చ చేసింది. గల్లా అశోక్ సినిమా షూటింగ్ కోసం రాజమండ్రికి వెళ్లిన నిధిని అభిమానులు చుట్టిముట్టారు. షూటింగ్ జరుగుతున్న లొకేషన్ వద్దకు జనాలు భారీగా వచ్చారు. ఇక నిధితో సెల్ఫీ సాధించేందుకు ఎంతో మంది అభిమానులు తోపులాటకు దిగారు. అలా నిధి క్రేజ్‌కు నిదర్శనంగా వీడియోలు వైరల్ అయ్యాయి.

పెంపుడు కుక్కతో..
సెలెబ్రిటీలకు పెట్స్‌ను పెంచుకోవడం మహా ఇష్టం. పైగా దేశ విదేశాల నుంచి మేలు రకపు జాతులను కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. అలా పెంపుడు కుక్కలతో సెలెబ్రిటీలు ప్రేమను పంచుకుంటారు. నిధి అగర్వాల్ కూడా తన పెట్‌ను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. అయితే తాజాగా తన పెట్ తనను ఎలా విసిగిస్తుందో వీడియో ద్వారా చూపించింది.

బాత్రూంకి వెళ్తుంటే..
హ్యాపీ.. టాయిలెట్‌కు వెళ్తుంటే కూడా ఎందుకు ఫాలో అవుతున్నావ్.. హ్యాపీ హ్యాపీ అంటూ తన పెట్ డోర్ వద్ద ధీనంగా చూస్తున్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మొత్తానికి అది హచ్ కుక్క అయి ఉంటుంది.. అందుకే అలా ఫాలో అవుతుందేమో.


Click it and Unblock the Notifications











