ఇండస్ట్రీలో కొనసాగాలంటే అది కచ్చితం.. నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
నిధి అగర్వాల్ తాజాగా ఓ సత్యం తెలుసుకుంది. ఇండస్ట్రీలో నిలబడాలి, కొనసాగాలి అంటే అసలు ఉండాల్సినది ఏంటన్న విషయం తెలుసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే రెండు ఎదురుదెబ్బలు తగలడం, ఇక వెనుకడుగు వేయాల్సిందే అనుకునే సమయంలో ఇస్మార్ట్ శంకర్ రూపంలో అదిరిపోయే హిట్ వచ్చింది. అలా నిధి అగర్వాల్ ఇండస్ట్రీలో కంటిన్యూ అయింది. లేదంటే నిధి అగర్వాల్ అనే పేరు కూడా కనిపించుకుండాపోయేది.

ఐరన్ లెగ్ అంటూ..
సవ్యసాచి, మిస్టర్ మజ్ను ఇలా వరుసగా రెండు చిత్రాలు డిజాస్టర్‌లు అవ్వడంతో అందరూ నిధి అగర్వాల్‌పై ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేశారు. అప్పటి వరకు నిధి అందాలను అందరూ పొగిడినా కూడా సక్సెస్ లేకపోవడంతో ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్‌తో అదిరిపోయే హిట్ కొట్టేయడంతో నిధి దశ తిరిగింది.

కోలీవుడ్‌లోనూ హల్చల్..
నిధి అగర్వాల్‌కు ఇప్పుడు తమిళంలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సంక్రాంతికి విడుదలైన రెండు చిత్రాలు క్లిక్ అయ్యాయి. అలా ఒకే సారి రెండు చిత్రాల్లో కనిపించి మెప్పించడంతో నిధి కోలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే తాజాగా నిధి ఈ స్టార్డం, సక్సెస్, ఇండస్ట్రీ గురించి వెరైటీ కామెంట్స్ చేసింది.

అర్థం కాని పరిస్థితి..
సినిమా సెలెబ్రిటీగా సోషల్ మీడియాలో ఎంతోమందితో సంభాషిస్తాం. ఆ సమయంలో రకరకాల వ్యక్తులు రకరకాల సలహాలు ఇస్తారు. అవన్నీ వింటుంటే ఒక్కోసారి అయోమయంలో పడిపోతాం. అసలు ఎవరు చెప్పిన మాటలు వినాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.

లక్ ఉండాల్సిందే..
నేను చేసిన సినిమా ఆడినా.. ఆడకపోయినా.. నా వంతు కృషి చేశాననే భావిస్తా. నిజాయతీగా చెప్పాలంటే.. మీరు మంచివారు కావచ్చు.. చెడ్డవారు కావచ్చు.. ఈ రంగంలో రాణించాలంటే మాత్రం మీరు అదృష్టవంతులై ఉండాలంటూ నిధి అసలు విషయం తెలుసుకుంది.

అదొక్కటి చాలదు..
కొన్నిసార్లు స్క్రిప్టు ఎంత బాగున్నా చివరికి సినిమా అనుకున్నట్లుగా రాదు. మరికొన్ని సినిమాలు స్క్రిప్టు బాగాలేకున్నా ఊహించిన దానికంటే తెరపై బాగా ఆడతాయి. అందుకే.. ఇక్కడ రాణించాలంటే అందం చాలదు.. అదృష్టమే 90శాతం కీలకపాత్ర పోషిస్తుందని నేను నమ్ముతానని నిధి అగర్వాల్ తెలిపింది.


Click it and Unblock the Notifications











