అమ్మ బాబోయ్ ఇలా చేసేసిందేంటి?.. మంట పెట్టేసిన నిధి అగర్వాల్
నిధి అగర్వాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంట పెట్టేసింది. మామూలుగానే నిధి అగర్వాల్ అందాల ఆరబోతలో పీహెచ్‌డీ చేసినట్టుగా వ్యవహరిస్తుంటుంది. తెరపై, సోషల్ మీడియాలోనూ నిధి తన అందాల వల విసురుతూ అభిమానుల కట్టిపడేస్తుంటుంది. అయితే మొదట్లో నిధి అగర్వాల్‌కు ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేశారు. అక్కినేని హీరోల సినిమాల్లో నటించిన నిధికి డిజాస్టర్లే ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు మాత్రం నిధి రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది.

మొదటి అడుగే..
మొదటి రెండు చిత్రాలు నిధి అగర్వాల్‌కు అంతగా కలిసి రాలేదు. నాగ చైతన్యతో చేసిన సవ్యసాచి, అఖిల్‌తో నటించిన మిస్టర్ మజ్ను రెండూ కూడా ఫ్లాప్‌గా మిగిలాయి. అలా మొదటి అడుగులోనే నిధికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ తరువాతే నిధి అగర్వాల్ దశ తిరిగింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది.

ఫేట్ మార్చేసింది..
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా నిధి అగర్వాల్‌ను స్టార్ హీరోయిన్‌గా మార్చేసింది. నిధి కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా ఈ మూవీ నిలిచింది. అయితే విచిత్రంగా ఈ సినిమా తరువాత నిధి అగర్వాల్ కోలీవుడ్‌లో బిజీగా మారింది.

కోలీవుడ్‌లో బిజీగా..
కోలీవుడ్‌లో నిధి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఒకేసారి రెండు చిత్రాల్లో నటించడం, ఆ రెండు కూడా సంక్రాంతి సీజన్‌లోనే బరిలోకి దిగడంతో నిధి హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం నిధి చేతిలో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది. గల్లా అశోక్ హీరోగా వస్తోన్న చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ..
సినిమాలేవీ లేకపోయినా, తెలుగు ప్రేక్షకులను పలకరించి ఏడాది దాటి పోతోన్నా కూడా నిధి అగర్వాల్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ నిధి అగర్వాల్ ఫాలోయింగ్ పెరుగుతూనే పోతోంది. అందుకు కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు.
Recommended Video

తాజాగా అలా..
నిధి అగర్వాల్ సెల్ఫీలు, మిర్రర్ సెల్ఫీలంటూ ఎంతగా రచ్చ చేస్తుంటుందో అంరదికీ తెలిసిందే. ఎద అందాలతో వల వేయడం నిధి అగర్వాల్‌కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా నిధి అగర్వాల్ ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసింది. అందులో నిధి తన లుక్స్‌తోనే కాల్చిపడేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











