twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిధి అగర్వాల్‌పై ఉప్పెనంతా అభిమానం.. చెన్నైలో గుడికట్టిన ఫ్యాన్స్

    |

    సినీ పరిశ్రమలో హద్దుల్లేని అభిమానం ఎవరికైనా ఉందంటే అది కోలీవుడ్‌ ప్రేక్షకులకే అని చెప్పవచ్చు. గతంలో కుష్భూ, నమితకు గుడి కట్టి తమకు ఉన్న ఎనలేని అభిమానాన్ని చాటుకొన్నారు. తాజాగా ఆ జాబితాలో నిధి అగర్వాల్‌ను అభిమానులు చేర్చారు. తమిళనాడులో నిధి అగర్వాల్‌కు గుడి కట్టడం దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

     బాలీవుడ్‌, టాలీవుడ్‌లో నిధి

    బాలీవుడ్‌, టాలీవుడ్‌లో నిధి

    నిధి అగర్వాల్‌ నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికి ఆమె సంపాదించుకొన్న పాపులారిటీ ఎక్కువే. మున్నా మైఖేల్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నిధి ఆ తర్వాత సవ్యసాచి మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్‌తో స్టార్ హీరోయిన్‌గా మారారు.

     తమిళంలో కేవలం రెండు చిత్రాలతోనే

    తమిళంలో కేవలం రెండు చిత్రాలతోనే

    నిధి అగర్వాల్ తెలుగు నుంచి వెంటనే తమిళ సినీ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు భూమి, ఈశ్వరన్ చిత్రాల్లోనే నటించారు. కేవలం రెండు చిత్రాలతోనే తమిళ అభిమానులు ఫిదా అయిపోయారు. వాలంటైన్ డే రోజును పురస్కరించుకొని ఆమెకు ఆలయం కట్టారు. దాంతో ఆ వార్త వైరల్ అయింది.

     గుడి కట్టారనే వార్తతో షాక్‌తిన్న నిధి అగర్వాల్

    గుడి కట్టారనే వార్తతో షాక్‌తిన్న నిధి అగర్వాల్

    తనకు గుడి కట్టడంపై నిధి అగర్వాల్ స్పందిస్తూ.. వాలంటైన్ డే గిఫ్టు అని నా అభిమానులు చెప్పారు. ఈ విషయాన్ని చెప్పగానే తొలుత షాక్ తిన్నాను. ఆ తర్వాత వారి అభిమానాన్ని చూసి ముచ్చట పడ్డాను. ఆలయం ఎక్కడ ఉందో కచ్చితంగా ప్లేస్ తెలియదు. చెన్నైలో ఉన్నట్టు మాత్రం తెలుసు. తమిళ, తెలుగు అభిమానులు కలిసి ఈ గుడిని కట్టారు అని నిధి అగర్వాల్ తెలిపారు.

    ఫ్యాన్స్‌కు జీవితాంతం రుణపడి ఉంటా

    ఫ్యాన్స్‌కు జీవితాంతం రుణపడి ఉంటా

    తమిళంలో కేవలం రెండు సినిమాలు చేసిన నాకు ఇలాంటి గౌరవం దక్కడం చాలా గర్వంగా ఉంది. నాకు అభిమాన సంఘాలు కూడా లేవు. పెద్దగా నేను సోషల్ మీడియాలో కూడా పెద్దగా చాటింగ్ చేయను. కానీ ఇలాంటి గౌరవం అందించిన నా అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటాను అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

    English summary
    Tamil, Telugu fans Valentine’s Day gift for Ismart Shankar heroine Nidhhi Agerwal temple in Chennai. Her fans built a temple and performed puja on Valentine day. On this occassion, Nidhhi shocked over Fans who showered love and affections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X