మెగా అప్డేట్.. నిహారిక-చైతన్యల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే?
మెగా ఇంట్లో పెళ్లి కళ ఉట్టిపడుతోందన్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు పెళ్లిళ్లతో మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అందులో ఓ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం ఆగస్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లికి సంబంధించిన పనులన్నీ వరుణ్ తేజ్ భుజాల మీదే వేశానని నాగబాబు చెప్పిన సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడు..
ఆ మధ్య నాగబాబు ఓ మీడియాతో మాట్లాడుతూ నిహారిక పెళ్లి గురించి కొన్ని విషయాలు చెప్పాడు. పెళ్లి డిసెంబర్‌లో జరుగుతుందని, డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలా కొన్ని హింట్లు ఇచ్చాడు. అయితే నిహారిక పెళ్లి పనులు మొత్తం వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడని చెప్పాడు. తాజాగా నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

అలా బయటకు వచ్చింది..
నిహారికకు కాబోయే మామగారు.. అంటే చైతన్య తండ్రి ప్రభాకర రావు తిరుమలలో ప్రత్యక్షమయ్యాడు. వివాహ పత్రికను స్వామి వారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్న అనంతరం వివాహ వేదిక, సమయాన్ని ప్రకటించాడు. ఈ మేరకు మెగా ఇంట్లో సందడి ప్రారంభమైనట్టు కనిపిస్తోంది.

ఎప్పుడు ఎక్కడ అంటే..
నిహారిక కొణిదెల మెడలో చైతన్య జొన్నగడ్డ డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మూడు ముళ్లు వేయనున్నాడు. ఈ మేరకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రభాకర్ రావు తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

రచ్చ రచ్చ..
నిశ్చితార్థం జరిగిన రోజు నుంచి నిహారిక చైతన్యలు రచ్చ రచ్చ చేస్తున్నారు. పార్టీలకు, రెస్టారెంట్‌లకు వెళ్తూ హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా బంధువుల ఇంట్లో నిశ్చితార్థం జరిగుతుంటే ఈ ఇద్దరూ జంటగా వెళ్లారు. కాబోయే భర్తను నిహారిక తన కౌగిలిలో బంధించేసింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











