పెళ్లికి ముందే గోవాలో రచ్చ.. స్నేహితులతో కలిసి నిహారిక దుమ్ములేపుతోంది!!
మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. అసలే పెళ్లి వేడుకల్లో భాగంగా ఫ్రెండ్స్ అందరితో కలిసి గోవాలో రచ్చ చేస్తోంది. నిహారికకు చైతన్యతో నిశ్చితార్థం కావడం, త్వరలోనే ఓ ఇంటికి వెళ్లనుండటంతో ఆమె స్నేహితులతో కలిసి సందడి చేసేందుకు రెడీ అయింది. లాక్ డౌన్‌లో నిశ్చితార్థం, మాటాముచ్చట జరగడంతో ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వలేకపోయింది. ఫ్రెండ్స్ కూడా ఆమెకు పార్టీ ఇవ్వలేకపోయారు. దీంతో ఇప్పుడు సమయం వచ్చింది.

లాక్‌డౌన్‌లో అన్ని..
మెగా డాటర్‌ను ఓ ఇంటి దాన్ని చేయాలని లాక్ డౌన్‌లోనే అడుగులు ముందుకు పడ్డాయి. మాటాముచ్చట జరగడం, ఆపై మంచి ముహూర్తం చేసుకుని ఆగస్ట్‌లో నిశ్చితార్థం కూడా జరిగాయి. అవి కూడా అతి దగ్గరి బంధువులతో, సన్నిహితుల మధ్యే జరిగింది. ఆ వేడుకలకు నిహారిక స్నేహితులెవ్వరూ హాజరు కాలేదు.

మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య..
నిహారిక నిశ్చితార్థం మెగా అల్లు ఫ్యామిలీలు మాత్రమే హాజరయ్యాయి. అటు వైపు నుంచి చైతన్య ఫ్యామిలీ మాత్రమే హాజరైంది. కోవిడ్ నిబందనలు పాటిస్తూ అత్యంత జాగ్రత్తగా ఆ వేడుకలను నిర్వహించారు. అందుకే ఆ వేడుకులకు నిహారక తన స్నేహితురాలెవ్వరినీ ఆహ్వానించలేదు.

కాబోయే భర్తతో కలిసి...
మామూలుగా నిహారిక తన నిశ్చితార్థం కాకముందే కాబోయే భర్తతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. మాట ముచ్చట అయ్యాక చైతన్యతో కలిసి నిహారిక బాగానే బయటకు వెళ్లింది. పైగా చైతన్య బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. అంతేకాకుండా భర్తపై ప్రేమను కురిపిస్తూ కవిత్వం కూడా చెప్పేసింది.
Recommended Video

ప్రస్తుతం గోవాలో రచ్చ..
ఇక తనకు పెళ్లి జరగబోతోండటంతో స్నేహితురాళ్లకు నిహారిక పార్టీ ఇస్తోంది. అయితే ఈ క్రమంలో నిహారిక స్నేహితురాళ్లే నిహారికకు సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఆమె కళ్లకు గంతలు కట్టి కారులో ఎక్కించుకుని తీసుకుపోయినట్టున్నారు. ఇక గోవాలో తన స్నేహితురాళ్లందరితో కలిసి దుమ్ములేపుతోంది. ఇక నిహారిక షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











