అది అద్భుతమైన ఫీలింగ్.. ఫుల్ జోష్‌లో నిహారిక.. మళ్లీ మొదలెట్టేసింది!
మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. పెళ్లి తరువాత నటనకు దూరమవుతుందనే టాక్ వచ్చినా కూడా కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వెబ్ సిరీస్‌లతో నిహారిక బాగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వెబ్ సిరీస్‌లను పరిచయం చేసింది.. పాపులర్ చేసింది కూడా నిహారికయే. వెండితెరపై నిహారిక ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నిహారిక తన ముద్రను వేసుకోలేకపోయింది.

నిహారిక అలా..
నిహారిక ఓటీటీ ప్రపంచంలో తన ముద్రను వేసుకుంది. నిహారిక వెబ్ సిరీస్‌లు తీయడం, నటించడంలో తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే నిహారిక మాత్రం వెండితెరపై అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా కమర్షియల్ హిట్ కొట్టలేకపోయింది.
పాయల్ రాజ్‌పుత్ బ్యూటిఫుల్ గ్యాలరీ.. లేటేస్ట్ పిక్స్ వైరల్

కోలీవుడ్‌లోనూ..
నిహారిక కోలీవుడ్‌లోనూ తన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఏకంగా విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే నిహారికకు కోలీవుడ్‌లోనూ చేదు అనుభవం ఎదురైంది. నిహారికకు వెండితెర కలిసి రావడం లేదు.

పెళ్లి తరువాత..
నిహారిక తన పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టే పెళ్లి ఫిక్స్ అయిన తరువాత ఓ కోలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. స్వాతిని, అశోక్ సెల్వన్ కాంబోలోరాబోతోన్న సినిమా నుంచి నిహారిక తప్పుకుంది.

ఆ మధ్య అలా..
నిహారిక సినిమాలకు దూరంగా ఉంది. కానీ వెబ్ సిరీస్‌లకు మాత్రం ఓకే చెబుతోన్నట్టుంది. ఆ మధ్య నిహారిక తన కొత్త ప్రాజెక్ట్‌ను లాంచనంగా ప్రారంభించేసింది. భర్త చైతన్య చేతుల మీదుగానే పూజా కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో అనసూయ కూడా ఓ కీ రోల్ పోషిస్తోంది.

అద్భుతమైన ఫీలింగ్..
నిహారిక చాలా గ్యాప్ తరువాత షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టేసింది. చాలా రోజుల తరువాత ఇలా సెట్, యాక్షన్ కెమెరా అనే వాటిని విని చాలా రోజులైనట్టుంది. సెట్‌లో వాతావరణాన్ని చూసి నిహారికలో ఫుల్ జోష్ వచ్చినట్టుంది. ఇది అద్భుతమైన ఫీలింగ్ అని నిహారిక చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











