బాబాయ్‌ను చూసి ఆశ్చర్యపోతుంటా.. తనలోకంలో తనుంటాడు.. మెగా డాటర్ సెన్సేషనల్ కామెంట్స్

మెగా ఫ్యామిలీలో అందరికంటే ప్రత్యేకంగా ఉంటాడు పవన్ కళ్యాణ్. ఆయన చేసే చేష్టలైనా, మాటలైనా సరే అన్ని వేరుగా ఉంటాయి. చిరంజీవి, నాగబాబు ఒకలా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్‌ మాత్రం ఇంకోలా ఆలోచిస్తాడు. వారిని దగ్గరి నుంచి చూసిన ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా అదే విషయాన్ని చెబుతారు. పవన్ వ్యవహార శైలి, ఆయన ఉండేతీరు ఇలా అన్నింటిలోనూ ఆయన ప్రత్యేకంగానే ఉంటాడు. ఈ విషయాలను గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పుకొచ్చారు. చిరు కూడా స్వయంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.

మితభాషి, నలుగురితో కలవలేడు..

మితభాషి, నలుగురితో కలవలేడు..

చిరంజీవి ఎన్నో ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ గురించిన సంగతులెన్నో చెప్పుకొచ్చాడు. ఇంట్లోంచి పారిపోవాలనుకునే ప్రయత్నం, ఎవ్వరితోనూ సరిగ్గా కలవలేకపోవడం, వెండితెరపై ఎంట్రీ ఇచ్చే సమయంలో ఎలా ఉండేవాడోనని వివరించిన ఘటనలెన్నో.

తాజాగా ఓ డైరెక్టర్ కూడా..

తాజాగా ఓ డైరెక్టర్ కూడా..


పవన్ కళ్యాణ్ గురించి వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీ రామ్ సైతం కొన్ని కామెంట్స్ చేశాడు. చెబుతూ... పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణే.. ఆయనకు రెండు విధాలుగా ప్రవర్తించడం రాదని చెప్పుకొచ్చాడు. షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికితే చాలు పుస్తకాలు చదువుతూ ఉంటారని కానీ మేము ఆయనకు ఆ సమయాన్ని ఇవ్వలేదని పవన్ వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా అవే పాయింట్స్ కోట్ చేసింది.

బాబాయ్‌ను చూసి ఆశ్చర్యపోతుంటా..

బాబాయ్‌ను చూసి ఆశ్చర్యపోతుంటా..


తాజాగా నెటిజన్లతో చిట్ చాట్ చేసిన నిహారిక తన బాబాయ్ పవన్‌కల్యాణ్‌ మాట్లాడింది. ‘పవన్ బాబాయ్ ఎక్కువగా మాట్లాడడు. మితభాషి. ఎప్పుడూ కామ్‌గా ఏదో పుస్తకం చదువుతూ తన లోకంలో తనుంటాడు. అలాంటి వ్యక్తి కొన్ని వేల మంది ఎదురుగా వేదికలపై ప్రసంగాలు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోతుంటా. పవన్ బాబాయ్ చాలా స్వచ్ఛమైన మనిషి. రాజకీయాల్లో అలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటార'ని నిహారిక చెప్పింది.

Recommended Video

Megastar Chiranjeevi To Enter Social Media | నా భావాలు అన్నీ పంచుకోడానికి వస్తున్నా..!!
ప్రభాస్‌తో పెళ్లి..?

ప్రభాస్‌తో పెళ్లి..?

తాజాగా ప్ర‌భాస్‌తో మీ పెళ్లి అనే వార్త‌లు వింటున్నాం అని ఓ నెటిజ‌న్ .. నిహారిక‌ను అడిగాడు. అందుకు ఆమె స్పందిస్తూ.. ‘ప్ర‌భాస్‌తో నా పెళ్లికి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. నేను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం లేదు. నా కుటుంబసభ్యులు చూపించిన వాడినే నేను పెళ్లి చేసుకుంటా'నని స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X