భర్తపై నిహారిక ముద్దుల వర్షం: క్లిప్ లీక్ చేసిన మెగా డాటర్.. ఏం రాసిందో చూస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఈ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడమే. అందులోనూ చాలా మంది స్టార్లుగా హవాను చూపిస్తుండడమే. అంతేకాదు, ఈ కుటుంబం నుంచి హీరోయిన్‌ను కూడా పరిచయం చేశారు. ఆమెనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది.
కెరీర్ కొనసాగుతోన్న సమయంలోనే ఆ మధ్య నిహారిక.. జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నిహారిక.. తన భర్తపై పడుకున్న క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

యాంకర్, నటి, నిర్మాతగా మారింది
నిహారిక కొణిదెల సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయిన 'ఢీ' అనే డ్యాన్స్ షోకు యాంకర్‌గా పని చేసింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించింది. ఈ క్రమంలోనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించిన ఆమె.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించి సత్తా చాటుకుంది.

హీరోయిన్‌గా మాత్రం వరుస షాక్‌లే
ఆరంభంలో యాంకర్‌గా, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో నటించి పేరు తెచ్చుకున్న నిహారిక.. హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన 'ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయమైంది. తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటివి చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు సక్సెస్‌ను అందించలేదు.

చైతన్యతో వివాహం.. ఫుల్ ఎంజాయ్
వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న సమయంలోనే నిహారిక సినిమాలకు కాస్త విరామం తీసుకుంది. ఆ సమయంలోనే చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది. అయితే, ఇప్పుడామె హీరోయిన్‌గా నటించకున్నా.. తన బ్యానర్‌లో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని విజయాలను కూడా అందుకుంది.

వరుసగా వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది
నిహారిక తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై ఆ మధ్య 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ప్రస్తుతం 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇందులో ఆర్యన్ రాజేష్, నిత్యా శెట్టి, నిఖిల్, అనిల్ గీలా తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శివ సాయి వర్థన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్
మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఇందులో ఎక్కువగా భర్త చైతన్యతో దిగినవే ఉంటున్నాయి.

భర్తపై పడుకుని నిహారిక ముద్దులు
వివాహం తర్వాత నిహారిక తన భర్త చైతన్యతో ఎంతో అన్యోన్యంగా ఉంటోంది. తరచూ అతడితో కలిసి టూర్లు వెళ్తోంది. అలాగే, ఖాళీ సమయాల్లో భర్తతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తోంది. ఇక, ఇప్పుడు నిహారిక.. చైతన్య ఒళ్లో పడుకుని ఉన్న ఓ క్లిప్‌ను మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో నిహారిక గాల్లో ముద్దులు కూడా పెట్టింది.

ఆ ముద్దులు అన్నీ నీకే అంటూనే
ఈ క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా షేర్ చేసిన నిహారిక.. 'నేను అతడి ఒళ్లో పడుకుని ఉన్నప్పటికీ.. నా దృష్టంతా నీ మీదనే. అలాగే, ఈ ముద్దులు కూడా నీకే అక్కా' అంటూ సుస్మితను ఉద్దేశించి పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడీ క్లిప్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











