ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక షాకింగ్ రియాక్షన్.. సీక్రెట్‌లన్నీ తనకే తెలుసంటూ బాంబ్ పేల్చింది.!

By Manoj Kumar P

టాలీవుడ్‌లో చాలా ఎక్కువ సంఖ్యలో సినీ కుటుంబాలు ఉన్నాయి. వాటన్నింటి నుంచి ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే, ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి మాత్రమే ఓ హీరోయిన్ వచ్చింది. ఆమె... మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. సినిమాల్లో నటించడమేమో కానీ, ఆమె ప్రభాస్‌తో ప్రేమాయణం సాగిస్తోందంటూ వార్తలు రావడం పెద్ద సంచలనం అయింది. అంతేకాదు, వీళ్లిద్దరికీ పెళ్లి కూడా జరగబోతుందంటూ ప్రచారం రావడం చర్చనీయాంశం అయింది. తాజాగా నిహారిక ఈ వ్యవహారంపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

అక్కడే మొదలెట్టింది.. చివరిగా ఇటొచ్చింది

అక్కడే మొదలెట్టింది.. చివరిగా ఇటొచ్చింది

సినిమాల్లోకి రావడం కంటే ముందే నిహారిక ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయిన ‘ఢీ' అనే డ్యాన్స్ షోకు యాంకర్‌గా పని చేసింది. అక్కడ తనదైన హోస్టింగ్‌తో మెప్పించిన ఈ అమ్మాయి.. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. అవన్నీ సూపర్ సక్సెస్ అవడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. దీంతో నిహారిక సినిమాల్లోకి ఎంటరై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

ప్రయత్నాలన్నీ విఫలం.. సినిమాలకు దూరం

ప్రయత్నాలన్నీ విఫలం.. సినిమాలకు దూరం

యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘ఒక మనసు' అనే సినిమాతో నిహారిక హీరోయిన్‌గా పరిచయం అయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఇక, ఆ తర్వాత ఆమె నటించన ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' కూడా పరాజయం పాలయ్యాయి. దీంతో మెగా డాటర్ సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది.

ఊహించని అవకాశం.. కోరిక నెరవేర్చుకుంది

ఊహించని అవకాశం.. కోరిక నెరవేర్చుకుంది

హీరోయిన్‌గా చేసిన సినిమాలన్నీ పరాజయం పాలవడంతో నిహారిక ఇకపై సినిమాల్లో నటించదని అనుకున్నారంతా. దీనికి అనుగుణంగానే ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి'లో ఓ చిన్న పాత్రను పోషించింది. దీంతో తన పెదనాన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్న తన కోరికను నెరవేర్చుకుంది.

 అక్కడ సూపర్ సక్సెస్.. మళ్లీ ఛాన్స్ పట్టింది

అక్కడ సూపర్ సక్సెస్.. మళ్లీ ఛాన్స్ పట్టింది

సినిమాల్లో విఫలమైనప్పటికీ.. వెబ్ సిరీస్‌లలో మాత్రం నిహారిక సూపర్ సక్సెస్ అవుతోంది. ఇప్పటికే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించిన ఆమె.. ‘ముద్దపప్పు ఆవకాయ్', ‘నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది. ఈ మధ్య ‘మ్యాడ్ హౌస్' అనే మరో వెబ్ సిరీస్‌ను నిర్మించింది. మరోవైపు, ఆమె చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య'లో ఛాన్స్ పట్టేసిందని తెలుస్తోంది.

హాట్ షోతో రచ్చ.. గ్లామర్ పాత్రలు చేస్తోందట

హాట్ షోతో రచ్చ.. గ్లామర్ పాత్రలు చేస్తోందట

నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను ఫాలో అయ్యే వారికి ఆ విషయం తెలుసు. కొద్ది రోజులుగా మెగా డాటర్ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో ఆమె గ్లామర్ పాత్రలు చేయడానికి రెడీ అవుతోందని అనుకున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని కన్ఫార్మ్ చేసిందామె.

ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక షాకింగ్ రియాక్షన్

ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక షాకింగ్ రియాక్షన్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో నిహారిక పెళ్లి జరగబోతుందంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిహారికకు ‘ప్రభాస్‌ను ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నారా అక్క' అని ఒకరు ప్రశ్నించారు. దానికి ‘నేను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం ఏంటండి.? ఆయనెక్కడ.? నేనెక్కడ.?' అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది నిహారిక.

Recommended Video

Megastar Chiranjeevi To Enter Social Media | నా భావాలు అన్నీ పంచుకోడానికి వస్తున్నా..!!
సీక్రెట్‌లన్నీ తనకే తెలుసంటూ బాంబ్ పేల్చింది.!

సీక్రెట్‌లన్నీ తనకే తెలుసంటూ బాంబ్ పేల్చింది.!

అలాగే, తన ఫ్యామిలీలో వరుణ్ కాకుండా చరణ్ అంటేనే బాగా ఇష్టమని చెప్పింది. అలాగే, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ చాలా క్లోజ్‌గా ఉంటారని తెలిపింది. ఆడవాళ్లలో శ్రీజ బెస్ట్ ఫ్రెండ్ అని, స్నేహారెడ్డి కూడా కలిసిపోతుందని వెల్లడించింది. ఇక, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితకు తన గురించి చాలా సీక్రెట్లు తెలుసని చెప్పి బాంబ్ పేల్చింది ఈ మెగా డాటర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X