ఓ వైపు పెళ్లి కాకముందే కాబోయే భర్తతో ఎంజాయ్.. మరోవైపు అలా కష్టపడిపోతోంది.. నిహారిక రచ్చ!!
మెగా డాటర్ నిహారిక-చైతన్యలకు పెళ్లి జరగబోతోందన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌లో అంగరంగ వైభవంగా సకుటుంబ సపరివార సమేతంగా నిశ్చితార్థపు వేడుకలు నిర్వహించారు. నిశ్చితార్థానికి ముందే నిహారిక తనకు కాబోయే భర్త్ ఎవరన్నది రివీల్ చేసింది. మాటముచ్చట అయ్యాక నిహారిక తనకు కాబోయే భర్త ఫోటోలను షేర్ చేసింది. ఇక మొదటి సారిగా ఆ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.

మెగా సందడి..
నిహారిక నిశ్చితార్థపు వేడుకల్లో మెగా అల్లు ఫ్యామిలీలు తెగ సందడి చేశాయి. అల్లు అర్జున్ జంట, రాం చరణ్ జంట ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా బన్నీ జంట అయితే కొత్త పెళ్లి జంటలానే ఉంది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ లేకపోడం లోటుగానే అనిపించింది. కానీ వ్రతం కారణంగా హాజరుకాలేకపోయాడు.

పెళ్లి కాకముందే...
నిహారిక జంట పెళ్లి కాకముందు నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇక చైతన్య బర్త్ డే సందర్భంగా నిహారిక చేసిన ట్వీట్ తెగ వైరల్ అయింది. ‘ఈ ఒక్క చిరునవ్వు రూమ్ నిండా వెలుగులు నింపుతుంది. ఆ ఒక్క హగ్ సొంత నివాసంలా అనిపిస్తుంది. నువ్వే నా సంతోషానికి చిరునామా. ప్రపంచలోనే అత్యుత్తమమైనవన్నీ పొందగలిగే అర్హత ఉన్నవాడివి. హ్యాపీ బర్త్ డే లవ్' అంటూ ఫియాన్సిపై ఉన్న ప్రేమను చాటుకుంది.

సినిమాలకు దూరం..
పెళ్లయ్యాక నిహారిక సినిమాలకు దూరంగా ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ పోస్ట్ కూడా వైరల్ అయింది. పెళ్లి ఫిక్స్ కాకముందు ఓ తమిళ ప్రాజెక్ట్‌కు నిహారిక సైన్ చేసింది. కానీ ఇటీవలె ఆమె ప్లేస్‌లో మేఘా ఆకాష్‌ను తీసుకున్నారు. పెళ్లి కారణంగానే సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
Recommended Video

వర్కౌట్లతో బిజీగా..
అయితే నిహారిక రీసెంట్‌గా తన ఫియాన్సిని కలిసినట్టు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇక అంతేకాకుండా రెగ్యులర్‌గా వర్కౌట్లు కూడా చేస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలను షేర్ చేసింది. నిహారిక కాబోయే భర్తకు మరింత అందంగా కనిపించాలని జీరో సైజ్ కోసం ట్రై చేస్తోందో ఏమో.


Click it and Unblock the Notifications











