కళ్లలో కళ్లు పెట్టి చూడు.. పీకల్లోతు ప్రేమలో మునిగిన నిహారిక-చైతన్య

మెగా డాటర్ నిహారికను చేసుకోబోయే వాడిగా చైతన్యకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతకు ముందు వందల్లో ఫాలోవర్స్ ఉన్న చైతన్యకు.. ఇప్పుడు వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అదంతా మెగా డాటర్ పుణ్యమే. నిహారికతో పెళ్లి అనే వార్తలు రాగానే చైతన్యకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్ల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతూనే వచ్చింది. తాజాగా చైతన్య తన బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు.

Recommended Video

Niharika Konidela Engagement Date Fix నిహారిక- చైతన్య ఫోటోలు ఫుల్ వైరల్ !! || Oneindia Telugu
క్యూట్ కపుల్స్..

క్యూట్ కపుల్స్..

నిహారిక తనకు కాబోయే భర్త మొహాన్ని ఎంతో సస్పెన్స్ తరువాత అందరికీ చూపించింది. మొదట ఘాడంగా హత్తుకున్న ఉన్న ఫోటోను షేర్ చేయగా..అందులో అతని మొహాన్ని కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఆపై కొద్ది సేపటి తరువాత కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది. ఇక వీరిద్దరికీ క్యూట్ కపూల్స్ అంటూ మంచి మార్కులే పడ్డాయి.

ఫోటోలు వైరల్..

ఫోటోలు వైరల్..

నిహారిక- చైతన్య ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటాయి. చైతన్య హీరోలా ఉన్నాడని, ఇక వెండితెరపై ఎంట్రీ ఎప్పుడంటూ కామెంట్స్ వినిపిస్తుంటాయి. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. నిహారిక తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. శ్రీవారిపై ప్రేమను కురిపించింది.

కాబోయే భర్తకు విషెస్..

కాబోయే భర్తకు విషెస్..

చైతన్య బర్త్ డే (జూలై 26) సందర్భంగా నిహారిక ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. ‘ఈ ఒక్క చిరునవ్వు రూమ్ నిండా వెలుగులు నింపుతుంది. ఆ ఒక్క హగ్ సొంత నివాసంలా అనిపిస్తుంది. నువ్వే నా సంతోషానికి చిరునామా. ప్రపంచలోనే అత్యుత్తమమైనవన్నీ పొందగలిగే అర్హత ఉన్నవాడివి. హ్యాపీ బర్త్ డే లవ్' అంటూ కాబోయే భర్తపై ప్రేమను కురిపించింది.

కళ్లలోకి కళ్లు పెట్టి..

కళ్లలోకి కళ్లు పెట్టి..

తాజాగా చైతన్య తన బర్త్ డే ఫోటోలను షేర్ చేశాడు. ఇద్దరూ కలిసి బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు చైతన్య షేర్ చేసిన ఫోటోల్లో వీరిద్దరి మధ్యఉన్న ప్రేమ ఘాడత ఇట్టే కనిపిస్తోంది. ఇద్దరూ కళ్లలోకి కళ్లు పెట్టి చూసుకుంటూ లోకాన్ని మైమరిచిపోయినట్టున్నారు. ఇదంతా నా 30వ పుట్టిన రోజు జరిగిందని చైతన్య ఈ క్యూట్ ఫోటోలను షేర్ చేయగా.. నిహారిక లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చింది.

ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్..

ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్..

ముందుగా వచ్చిన వార్తల ప్రకారం.. ఆగస్టులో నిశ్చితార్థం.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి అని టాక్ నడిచింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆగస్టు 13న నిశ్చితార్థం.. డిసెంబర్‌లో వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది మెగా ఇంట్లో సంబరాలు మిన్నంటనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X