నిహారిక కాబోయే భర్త పేరు వివరాలు లీక్: ఫొటో రివీల్ చేసేశారు.. అందులో ఉన్నది బాస్ కొడుకే.!

By Manoj

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించడమే కాకుండా.. వ్యక్తిగత ఇమేజ్‌తో ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది నిహారిక. పేరుకు మెగా డాటరే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. నటిగా ఎంతో పేరును సంపాదించుకోవాలనుకున్న సమయంలో నిరుత్సాహం ఎదురైనప్పటికీ.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నిహారికకు పెళ్లి ఫిక్స్ చేశారు ఆమె తండ్రి నాగబాబు. తాజాగా ఆమెకు కాబోయే భర్త వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులు మీకోసం.!

 హీరోయిన్‌గా విఫలం.. రెండు చోట్లా సూపర్ సక్సెస్

హీరోయిన్‌గా విఫలం.. రెండు చోట్లా సూపర్ సక్సెస్

నిహారిక బుల్లితెరపై ప్రసారమైన ‘ఢీ' అనే షో ద్వారా తెలుగు వాళ్లకు సుపరిచితురాలు అయింది. అక్కడ మెప్పించడంతో సినిమాల్లోనూ సత్తా చాటుతుందని అనుకున్నారంతా. అయితే, ఊహించని విధంగా ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. అదే సమయంలో వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో మాత్రం ఆమె సూపర్ సక్సెస్ అవుతోంది.

సినిమాలకు దూరం... చిరంజీవి, చరణ్ సహకారంతో

సినిమాలకు దూరం... చిరంజీవి, చరణ్ సహకారంతో

హీరోయిన్‌గా వరుస పరాజయాలు చవి చూడడంతో నిహారిక సినిమాలకు దూరం అయిపోయింది. ఇకపై, సినిమాల్లో నటించదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో నిహారికకు రామ్ చరణ్ నిర్మాణంలో చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి' సినిమాలో అవకాశం దక్కింది. ఇక, మరోసారి వాళ్ల కాంబోలో రాబోతున్న ‘ఆచార్య'లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

నిహారిక పెళ్లిపై తండ్రి నాగబాబు అధికారిక ప్రకటన

నిహారిక పెళ్లిపై తండ్రి నాగబాబు అధికారిక ప్రకటన

తెలుగులో చేయకున్నా తమిళ సినిమాలను ఒప్పుకుంటోంది నిహారిక. అదే సమయంలో వెబ్ సిరీస్‌లతోనూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు వివాహం చేయబోతున్నట్లు తండ్రి నాగబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘నిహారికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. వాటిలో ఒకటి ఫిక్స్ అయినట్లే. ఆ వివరాలు త్వరలోనే చెబుతాం' అని వెల్లడించారాయన.

తన వివాహంపై సంకేతాలు ఇచ్చిన మెగా డాటర్

తన వివాహంపై సంకేతాలు ఇచ్చిన మెగా డాటర్

త్వరలోనే నిహారిక పెళ్లి చేస్తాం అని నాగబాబు ప్రకటించిన కొద్ది రోజులకే.. దానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. మెగా డాటర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కాఫీ కప్పుపై మిస్ నిహారిక అనే ట్యాగ్‌లో మిస్‌ను కొట్టేసి.. మిసెస్ నిహారిక అంటూ రాసింది. దీంతో పెళ్లి గురించి ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చిందని అందరికీ అర్థమైంది. అయితే, పెళ్లి కొడుకుపై మాత్రం క్లారిటీ రాలేదు.

కాబోయే భర్తను హగ్ చేసుకుంటూ నిహారిక ఫోజు

కాబోయే భర్తను హగ్ చేసుకుంటూ నిహారిక ఫోజు

నిహారిక పెళ్లి గురించి రెండు రోజులుగా వార్తలు వెల్లవెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను కౌగిలించుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నిహారిక. అయితే, ఈ ఫొటోలో సదరు యువకుడు వెనుక నుంచి ఉండడంతో ఎవరన్న దానిపై క్లారిటీ రాలేదు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మెగా అల్లుడి పేరు వివరాలు లీక్.. బాస్ కొడుకే

నిహారికను పెళ్లాడబోయే యువకుడి వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మెగా డాటర్‌ను మనువాడబోయే వ్యక్తి పేరు చైతన్య. అతడు గుంటూరు జిల్లాలోని ఓ పోలీస్ బాస్ కుమారుడు. బాగా చదువుకున్న అతడు ఆరుడుగుల పొడవు, హ్యాండ్సమ్‌ లుక్‌తో ఉంటాడు. వీళ్ల నిశ్చితార్థం ఆగస్టు నెలలో జరగబోతుంది.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
నిహారిక కాబోయే భర్త ఫొటో కూడా వచ్చేసింది

నిహారిక కాబోయే భర్త ఫొటో కూడా వచ్చేసింది

నిహారికను పెళ్లి చేసుకోబోతున్న చైతన్యకు సంబంధించిన ఫొటో వచ్చేసింది. కొందరు సినీ పీఆర్వోలు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలోనూ నిహారిక, చైతన్య హగ్ చేసుకుని కనిపిస్తున్నారు. చూడ్డానికి హ్యాండ్సమ్ హీరోలా కనిపిస్తున్న చైతన్య... నిజంగానే ఆరడుగుల ఆజానుభావుడిలా ఉన్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X