twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారంతా నిహారిక కాళ్లు పట్టుకున్నారు.. అసలు గుట్టు విప్పిన మెగా డాటర్

    |

    మెగా డాటర్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో డెకరేషన్, అరేంజ్మెంట్స్ అలా ఉంటే.. ఇక పెళ్లి వేడుక ఎలా ఉంటుందా? అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. బుధవారం రాత్రి నుంచి మొదలైన నిహారిక పెళ్లి సంబురాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నిహారిక కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో మెగా యువరాణి నవ్వుల్లో తేలిపోతూ కనిపించింది. ఆ నవ్వులకు ఓ కారణం ఉందట.

    మెగా ఈవెంట్..

    మెగా ఈవెంట్..

    నిహారిక పెళ్లి ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా కనిపిస్తోంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో అంగరంగ వైభవంగా డిసెంబర్ 9న రాత్రి వివాహారం జరగనుంది. అసలు సిసలు మెగా ఈవెంట్ ఏంటో ఇప్పుడు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    పెళ్లికి ముందే రచ్చ..

    పెళ్లికి ముందే రచ్చ..

    నిహారిక చైతన్యలు మూడు ముళ్లు పడక ముందే రచ్చ రచ్చ చేశారు. ఇరు కుటుంబాలు ఒప్పుకుని మాట ముచ్చట్లు చేసుకున్న తరువాత నుంచి నిహారిక చైతన్యలు సోషల్ మీడియాను ఊపేయడం ప్రారంభించారు. పార్టీలు, జిమ్‌లు, ప్రైవేట్ ఈవెంట్లు, స్నేహితుల పెళ్లిళ్లకు తిరిగుతూ రచ్చ చేశారు. ఇప్పుడు ఇక వాటన్నంటికి గుడ్ బై చెప్పేసి పెళ్లి పనుల్లో బిజీ అయినట్టు కనిపిస్తోంది.

    మెగా పార్టీలో రచ్చ..

    మెగా పార్టీలో రచ్చ..

    నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా నాగబాబు ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ మేరకు నిన్న గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు, ఇందులోనే చిరు పెద్ద కూతురు సుష్మిత భర్త బర్త్ డే వేడుకలు కూడా జరిగాయి. నిహారిక పెళ్లి సంబరాల్లో మెగా, అల్లు ఫ్యామిలీ రచ్చ రచ్చ చేశాయి. చెల్లెల్లతో కలిసి వరుణ్ తేజ్ సందడి చేసినట్టు కనిపిస్తోంది.

    Recommended Video

    Sai dharam Tej Marriage Is Expected In 2021 Summer
     తాజాగా నిహారిక అలా..

    తాజాగా నిహారిక అలా..

    తాజాగా నిహారిక కొన్ని ఫోటోలను షేర్ చేసింది. నిహారికను తన ఫ్రెండ్స్ రెడీ చేసినట్టు కనిపిస్తోంది. అయితే అందులో భాగంగా వారు నిహారిక కాళ్లు పట్టుకుని హీల్స్‌ను సెట్ చేస్తుండగా దించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ పొజిషన్‌లో ఉన్న ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో అని నిహారిక వివరిస్తూ నవ్వులు చిందించింది. మొత్తానికి యువరాణిలా ఉన్న నిహారికను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

    English summary
    Niharika Konidela Funny Comments On Friends In Pre wedding Celebrations, Nikarika Konidela' latest post on Instagram has become the hot topic of discussion on the social media. Her marriage has been in discussion for quite some time. Recently she took to her twitter to share a pic with the text “Ms/Mrs Niharika” on a coffee cup.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X