Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వారంతా నిహారిక కాళ్లు పట్టుకున్నారు.. అసలు గుట్టు విప్పిన మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో డెకరేషన్, అరేంజ్మెంట్స్ అలా ఉంటే.. ఇక పెళ్లి వేడుక ఎలా ఉంటుందా? అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. బుధవారం రాత్రి నుంచి మొదలైన నిహారిక పెళ్లి సంబురాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నిహారిక కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో మెగా యువరాణి నవ్వుల్లో తేలిపోతూ కనిపించింది. ఆ నవ్వులకు ఓ కారణం ఉందట.
మెగా ఈవెంట్..
నిహారిక పెళ్లి ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా కనిపిస్తోంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో అంగరంగ వైభవంగా డిసెంబర్ 9న రాత్రి వివాహారం జరగనుంది. అసలు సిసలు మెగా ఈవెంట్ ఏంటో ఇప్పుడు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లికి ముందే రచ్చ..
నిహారిక చైతన్యలు మూడు ముళ్లు పడక ముందే రచ్చ రచ్చ చేశారు. ఇరు కుటుంబాలు ఒప్పుకుని మాట ముచ్చట్లు చేసుకున్న తరువాత నుంచి నిహారిక చైతన్యలు సోషల్ మీడియాను ఊపేయడం ప్రారంభించారు. పార్టీలు, జిమ్‌లు, ప్రైవేట్ ఈవెంట్లు, స్నేహితుల పెళ్లిళ్లకు తిరిగుతూ రచ్చ చేశారు. ఇప్పుడు ఇక వాటన్నంటికి గుడ్ బై చెప్పేసి పెళ్లి పనుల్లో బిజీ అయినట్టు కనిపిస్తోంది.
మెగా పార్టీలో రచ్చ..
నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా నాగబాబు ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ మేరకు నిన్న గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు, ఇందులోనే చిరు పెద్ద కూతురు సుష్మిత భర్త బర్త్ డే వేడుకలు కూడా జరిగాయి. నిహారిక పెళ్లి సంబరాల్లో మెగా, అల్లు ఫ్యామిలీ రచ్చ రచ్చ చేశాయి. చెల్లెల్లతో కలిసి వరుణ్ తేజ్ సందడి చేసినట్టు కనిపిస్తోంది.
Recommended Video
తాజాగా నిహారిక అలా..
తాజాగా నిహారిక కొన్ని ఫోటోలను షేర్ చేసింది. నిహారికను తన ఫ్రెండ్స్ రెడీ చేసినట్టు కనిపిస్తోంది. అయితే అందులో భాగంగా వారు నిహారిక కాళ్లు పట్టుకుని హీల్స్‌ను సెట్ చేస్తుండగా దించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ పొజిషన్లో ఉన్న ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో అని నిహారిక వివరిస్తూ నవ్వులు చిందించింది. మొత్తానికి యువరాణిలా ఉన్న నిహారికను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.