నోరూరించే ఆవకాయ్ పచ్చడి.. మెగా డాటర్ నీహారిక కొణిదెల వీడియో వైరల్
ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాల్సి వస్తోంది. ఇప్పటికే దాదాపు 50 రోజలకు పైగా లాక్ డౌన్‌లోనే ఉంటూ వస్తున్నారు. ఇంకా మరికొన్ని రోజులు ఇలానే ఉండాల్సి రావొచ్చు. క్షణం తీరిక లేకుండా గడిపే స్టార్ హీరోలంతా కరోనా పుణ్యమా అని ఇంటి పట్టునే ఉంటున్నారు. ఫ్యామిలీతో సరదాగా గడిపేస్తున్నారు. అయితే మరోవైపు షూటింగ్స్ రద్దవ్వడం, పరిశ్రమ తాత్కాలికంగా మూతపడటంతో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సినీ కార్మికులను ఆదుకునేందుకు సెలెబ్రిటీలంతా ముందుకు వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. సినీ శ్రామికులను ఆదుకునేందుక సాయం చేస్తున్నారు. అయితే ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ క్వారంటైన్ సమయాన్ని హరోహీరోయిన్లు చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. తమలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు.కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. వంటింట్లో దూరి కొత్తగా ట్రై చేస్తున్నారు.

తాజాగా మెగా డాటర్ నిహారిక తెలుగింటి ఫేవరేట్ అయిన ఆవకాయ్ పచ్చడిని పెట్టడం నేర్చుకుంది. ఈ మధ్యే ఉపాసన కూడా దోమకొండ సంస్థాన పద్దతిలో ఆవకాయ్ పెట్టినట్టు తెలిపింది. అయితే రీసెంట్‌గా నిహారిక సైతం.. ఆవకాయ్ పచ్చడి పెట్టింది. అమ్మ ఆధ్వర్యంలో ఆవకాయ్ పెట్టడం నేర్చుకుంది. ఈ మేరకు ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఆవకాయ్ పెట్టాక రుచి చూస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. తాజాగా నిహారిక తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలను ప్రకటించింది. తమిళంలో ఓ చిత్రాన్ని చేయబోతోన్నట్టు తెలిపింది.


Click it and Unblock the Notifications











