కొణిదెల వారింట్లో పసుపు పండుగ.. నిహారిక ముఖంలో పెళ్లి కళ.. ఫ్యామిలీలో జోష్

టాలీవుడ్‌లో కొణిదెల కుటుంబంలో పెళ్లి భజాలు మోగేందుకు సిద్ధంగా ఉన్నాయి. మెగా బ్రదర్ ముద్దుల కుమార్తె నిహారిక పెళ్లి గడియలు సమీపిస్తుండటంతో ఇంట్లో జరుగాల్సిన శుభకార్యాలు జోరందుకున్నాయి. కార్పోరేట్ పెళ్లిలకు భిన్నంగా సంప్రదాయ పద్దతులకు కొణిదెల కుటుంబం తెర లేపారు. పెళ్లి శుభప్రదమైన పసుపు పండుగతోనే పనులను ప్రారంభించారు. ఆ పసుపు పండుగకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Niharika Engagement : నిరాడంబరం గా వేడుక, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా Allu Arjun || Oneindia Telugu
నిరాడంబరంగా ఎంగేజ్‌మెంట్

నిరాడంబరంగా ఎంగేజ్‌మెంట్

కరోనా పరిస్థితులు వెంటాడుతుండటంతో నిహారిక పెళ్లి నిశ్చితార్థం వేడుకను నిరాడంబరంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రాంచరణ్, అల్లు అర్జున్, కల్యాణ్ దేవ్ దంపతులు హాజరయ్యారు. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వేడుకలో పాల్గొన్నారు. చైతన్య, నిహారిక కుటంబ కార్యక్రమంగానే ఈ వేడుక జరగడంతో అతిథులెవ్వరినీ ఆహ్వనించనట్టు సమాచారం.

పసుపు కొట్టే వేడుక

పసుపు కొట్టే వేడుక

ఇక పెళ్లి ముహుర్తం సమీపిస్తున్న సమయంలో ఇంట్లో శుభ కార్యక్రమాలకు ప్రారంభించారు. పెళ్లికి మొదటి అడుగైన పసుపు కొట్టే కార్యక్రమాన్ని ముత్తైదువలను ఆహ్వానించి ప్రారంభించారు. ముత్తైదువలు కొట్టిన పసుపును పెళ్లి కార్యక్రమాల్లో ఉపయోగించడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ అనే విషయం తెలిసిందే.

పవిత్రమైన శుభ కార్యక్రమంలో

పవిత్రమైన శుభ కార్యక్రమంలో

పెళ్లికి ముందు పవిత్రంగా భావించే పసుపు కొట్టే వేడుక కోసం ఇంటిని అందంగా అలకరించారు. పలు రకాల పూలతో ఇంటిని శోభయమానంగా మార్చారు. ఇంటికి అతిథులను ఆహ్వానించి ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.

కొణిదెల ఫ్యామిలీలో సంతోష క్షణాలు

కొణిదెల ఫ్యామిలీలో సంతోష క్షణాలు

పసుపు కొట్టే వేడుక సందర్భంగా కొణిదెల ఫ్యామిలీలో సంతోష క్షణాలు వెల్లివిరిసాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగబాబు బంధువులు, స్నేహితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సురేఖ సతీమణి చేతుల మీదుగా

సురేఖ సతీమణి చేతుల మీదుగా

నాగబాబు ఇంట్లో జరిగిన శుభకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంప్రదాయంగా పెళ్లి పనులకు అంకురార్పణ జరిపించారు.

నిహారికతో చిరంజీవి కూతుళ్లు

నిహారికతో చిరంజీవి కూతుళ్లు

సోదరి నిహారిక పెళ్లికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ. తన సోదరి నిహారికతో కలిసి పసుపు దంచుతూ వేడుకలో పాల్గొన్నారు.

కొణిదెల ఫ్యామిలీ సభ్యులతో

కొణిదెల ఫ్యామిలీ సభ్యులతో

పసుపు వేడుకకు హాజరైన చిరంజీవి సోదరిమణులతో నాగబాబు సతీమణి, నిహారిక, శ్రీజ. ఫ్యామిలీ సభ్యులందరూ హాజరు కావడంతో ఈ వేడుక కళకళలాడింది.

స్నేహితులతో నిహారిక

స్నేహితులతో నిహారిక

తమ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి హాజరైన స్నేహితులతో కలిసి ఆనంద క్షణాలు పంచుకొంటున్న నిహారిక

తల్లితో ప్రేమగా నిహారిక

తల్లితో ప్రేమగా నిహారిక

పసుపు వేడుకలో తల్లిని ప్రేమతో ముద్దాడుతున్న నిహారిక కొణిదెల

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X