నిహారిక పెళ్లి విషయంలో వరుణ్ తేజ్ మాస్టర్ ప్లాన్ .. మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతున్నదంటే..

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయనే విషయంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల పెళ్లికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయనే విషయం మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నిహారిక పెళ్లి విషయంలో మెగా ఫ్యామిలీ ప్లాన్ బీని అమలు చేస్తున్నారనే వార్త బయటకు వచ్చింది. ఇంతకు నిహారిక పెళ్లికి సంబంధించిన ప్లాన్ బీ ఏమిటంటే..

నిహారిక అఫైర్‌కు గ్రీన్ సిగ్నల్

నిహారిక అఫైర్‌కు గ్రీన్ సిగ్నల్

లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతున్న సమయంలో అనూహ్యంగా నిహారిక పెళ్లి వార్త బయటకు వచ్చింది. ప్రముఖ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్య‌, నిహారిక ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారి అఫైర్‌కు శుభం కార్డు పడింది.

ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం

ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం

ఇక నిహారిక, చైతన్య నిశ్చితార్థం మెగా ఫ్యామిలీలో జరిగే అంగరంగ వైభవంగా కార్యక్రమాలకు భిన్నంగా సాధారణంగా, నిరాడంబరంగా పెళ్లి నిశ్చితార్థం జరిగింది. కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నిబంధలనకు అనుగుణంగా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆగస్టు 13వ తేదీన జరిగిన ఈ వేడుకకు కేవలం చిరంజీవి, రాంచరణ్, అల్లు అరవింద్, అర్జున్ ఫ్యామిలీలతోపాటు చైతన్య కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

నిహారిక పెళ్లి వెడ్డింగ్ డెస్టినేషన్‌గా

నిహారిక పెళ్లి వెడ్డింగ్ డెస్టినేషన్‌గా


లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా నిహారిక, చైతన్య పెళ్లి వేడుకను హైదరాబాద్‌లోనే నిరాడంబరంగా జరిపించాలని ముందుగా ప్లాన్ చేసుకొన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో నిహారిక మ్యారేజ్‌ను వరుణ్ తేజ్ డెస్టినేషన్ వెడ్డింగ్ మార్చినట్టు సమాచారం. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వరుణ్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

డిసెంబర్‌లోనే నిహారిక వివాహం..

డిసెంబర్‌లోనే నిహారిక వివాహం..

నిహారిక, చైతన్య పెళ్లి వేడుకను డెస్టినేషన్‌గా మార్చిన క్రమంలో అనువైన ప్రదేశం కోసం వేట మొదలైంది. రెండు, మూడు ప్రదేశాలు పరిశీలనలో ఉన్నాయని, ఒక్కసారి ప్లేస్ డిసైడ్ అయితే డిసెంబర్‌లో నిహారిక పెళ్లిని జరిపించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు తెలిసింది.

Recommended Video

Niharika Engagement : నిరాడంబరం గా వేడుక, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా Allu Arjun || Oneindia Telugu
జోరందుకున్న నిహారిక పెళ్లి పనులు

జోరందుకున్న నిహారిక పెళ్లి పనులు

ఇప్పటికే నిహారిక పెళ్లికి సంబంధించిన పనులు జోరుగా కొనసాగుతన్నాయనే విషయాన్ని సన్నిహితులు పేర్కొన్నారు. పెళ్లి కార్డుల పంపకం, అతిథుల జాబితాను సిద్దం చేసినట్టు సమాచారం. త్వరలోనే డిస్టినేషన్ ఎంపిక పూర్తి కాగానే పెళ్లి పనుల విషయంలో మరింత జోరును ప్రదర్శించాలనే విషయాన్ని వెల్లడించారు. ఇక నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడ జరుగుతుందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X