వరుణ్ తేజ్ పరువు తీసిన నిహారిక: బాత్రూంలో ఎక్కువ సేపు ఉండడం వల్లే ఇలా అంటూ కౌంటర్

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఎంతో ప్రత్యేకమైనదని చెబుతుంటారు. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి దాదాపు పది మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అవడంతో పాటు వాళ్లలో చాలా మంది స్టార్లు వెలుగొందుతుండడమే. ఈ క్రమంలోనే 'ఉప్పెన' అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా ఇటీవలే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ ఫ్యామిలీకి చెందిన హీరోలు, మెగా ప్రిన్సెస్ నిహారిక అతడితో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఎంతో ఫన్నీగా సాగిన ఇందులో ఎన్నో విషయాలు లీక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిహారిక మెగా హీరో పరువు తీసేసింది. ఆ వివరాలు మీకోసం!

 స్పెషల్‌గా ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్

స్పెషల్‌గా ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్

సాధారణంగా సినీ వారసుడి ఎంట్రీ అంటే కమర్షియల్ కథను ఎంచుకుంటారు. కానీ, వైష్ణవ్ తేజ్ మాత్రం కొత్త దర్శకుడు బుచ్చిబాబుతో 'ఉప్పెన' వంటి క్లిష్టమైన ప్యూర్ లవ్ స్టోరీని ఎంపిక చేసుకుని సాహసమే చేశాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. కృతీ శెట్టి హీరోయిన్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

 మూవీకి ‘ఉప్పెన'లా వెల్లువెత్తిన కలెక్షన్లు

మూవీకి ‘ఉప్పెన'లా వెల్లువెత్తిన కలెక్షన్లు

టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు సాధించి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన 'ఉప్పెన'.. రెండో రోజు కూడా అదే జోరును చూపించింది. తద్వారా చాలా ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలలో అదరగొట్టేసింది. దీంతో మొత్తంగా రెండు రోజులకు కలిపి రూ. 16.21 కోట్ల షేర్, రూ. 25.80 కోట్ల గ్రాస్ అందుకుంది. తద్వారా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసిందీ మూవీ.

మెగా కజిన్స్ ఇంటర్వ్యూ.. ట్రెండ్ అవుతోంది

మెగా కజిన్స్ ఇంటర్వ్యూ.. ట్రెండ్ అవుతోంది

మెగా ఫ్యామిలీ నుంచి హీరో పరిచయం అవుతోన్న నేపథ్యంలో ఆ కుటుంబానికి చెందిన హీరోలు నిహారికతో కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. దీనికి 'ఉప్పెన' హీరో వైష్ణవ్ తేజ్‌తో పాటు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హాజరయ్యారు. వీళ్లంతా సినిమాకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడంతో పాటు పర్సనల్ మేటర్లను సైతం లీక్ చేసుకున్నారు.

రొమాన్స్ గురించి హీరోను ఆడుకున్నారు

రొమాన్స్ గురించి హీరోను ఆడుకున్నారు

వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమా కోసం పడిన కష్టం సహా అనుభవాలన్నింటినీ తన కజిన్స్‌తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా హీరోయిన్‌తో చేసిన రొమాన్స్ గురించి వాళ్లు ముగ్గురూ కలిసి అతడిని ప్రశ్నించారు. అంతేకాదు, 'నేను అమ్మాయిలతోనే మాట్లాడేవాడిని కాదు' అని తేజూ అనగా.. 'అసలు మూడు సినిమాల వరకు నేను హీరోయిన్‌నే కలవలేదు' అని వరుణ్.. వైష్ణవ్‌ను ఆటపట్టించారు.

 తన అన్న వరుణ్ పరువు తీసిన నిహారిక

తన అన్న వరుణ్ పరువు తీసిన నిహారిక

ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముగ్గురు హీరోలతో ఓ ఆట ఆడించింది నిహారిక. అందులో ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానంగా అక్కడున్న వాళ్ల పేర్లలో ఏదో ఒకటి చూపించాలి. ఇందులో భాగంగా నిహారిక 'మనందరిలో రెండు మూడు రోజుల పాటు స్నానం చేయకుండా ఉండే వాళ్ల పేరు చెప్పండి' అని ఆమె ప్రశ్నించగా.. అందరూ వరుణ్ తేజ్ పేరు చెప్పారు. అతడు కూడా తన పేరే రాశాడు.

Recommended Video

Acharya Teaser : నిడివి నిమిషం పైనే.. చిరు పవర్ ఫుల్ డైలాగ్ తో.. Chiranjeevi | Ram Charan
 బాత్రూంలో ఎక్కువ సేపు ఉండడం వల్లే ఇలా

బాత్రూంలో ఎక్కువ సేపు ఉండడం వల్లే ఇలా

వరుణ్ తేజ్ స్నానం చేయడన్న మేటర్ హైలైట్ అవడంతో.. ఆ వెంటనే అతడు కూడా నిహారికను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. 'నిహారిక బాత్రూంలోకి వెళ్లిందంటే గంటల కొద్ది లోపలే ఉండిపోతుంది. ఎంత పిలిచినా బయటకు రాదు. అందుకే నాకు స్నానం చేయడం కుదరదు' అంటూ క్లారిటీ ఇచ్చాడు వరుణ్. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X