వాళ్ల కారణంగానే మా నాన్న పిచ్చోడిలా: నాగబాబు మానసిక స్థితిపై నిహారిక షాకింగ్ కామెంట్స్

By Manoj Kumar P

బుల్లితెరపై వచ్చే ప్రముఖ డ్యాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. ఆ షోను హోస్ట్ చేసే సమయంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. వరుసగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు, టీవీ షోలతో బిజీగా గడుపుతున్న ఈ మెగా డాటర్.. తాజాగా తన తండ్రి నాగబాబు మానసిక స్థితిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం.!

అక్కడ సక్సెస్.. ఇక్కడ ఫెయిల్యూర్

అక్కడ సక్సెస్.. ఇక్కడ ఫెయిల్యూర్

‘ఢీ' డ్యాన్స్‌ షోకు యాంకర్‌గా పరిచయమైన నిహారిక.. అందులో చేస్తున్నన్ని రోజులు తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అయితే, హీరోయిన్‌గా మాత్రం ఆమెకు అస్సలు కలిసి రాలేదు. హీరోయిన్‌గా పరిచయం అయిన క్రమంలో ఆమె చేసిన ‘ఒక మనసు', ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టడంతో నిహారికతో పాటు మెగా ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.

హ్యాట్రిక్‌తో కఠిన నిర్ణయం తీసుకుంది

హ్యాట్రిక్‌తో కఠిన నిర్ణయం తీసుకుంది

సినిమాల్లోకి వచ్చిన తర్వాత నిహారికకు పరాజయాల హ్యాట్రిక్ ఎదురైంది. దీంతో ఆమె ఇకపై హీరోయిన్‌గా నటించకూడదని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో ఓ వార్త బయటకు వచ్చింది. ఆమె తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి తండ్రి నాగబాబుతో పాటు పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు పలికినట్లు జోరుగా ప్రచారం జరిగింది.

లక్కీ ఛాన్స్ కొట్టేసిన మెగా డాటర్

లక్కీ ఛాన్స్ కొట్టేసిన మెగా డాటర్

వరుస పరాజయాలతో సతమతమవుతున్న నిహారిక.. చాలా రోజులుగా మరో సినిమాలో నటించలేదు. అయితే, తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి'లో మాత్రం చిన్న పాత్ర చేసింది. చిరంజీవి సినిమాలో ఎప్పటికైనా నటించాలన్న కోరికను ఈ విధంగా తీర్చుకుంది. చేసింది చిన్న పాత్రే అయినా మెగా ఫ్యాన్స్ ఆమె ఎంట్రీని ఆస్వాదించారు.

హాట్ షోతో రెచ్చిపోతోన్న నిహారిక

హాట్ షోతో రెచ్చిపోతోన్న నిహారిక

మెగా డాటర్ నిహారిక కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. దీంతో నిహారిక తరచూ వార్తల్లో నిలుస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు, ఈ కారణంగా నిహారికకు ఫాలోవర్లు కూడా భారీగా పెరుగుతున్నారు.

సినిమాల్లో ఫెయిలైనా వాటిలో సక్సెస్

సినిమాల్లో ఫెయిలైనా వాటిలో సక్సెస్

నిహారిక సినిమాల్లోకి రాకముందే కొన్ని షార్ట్ ఫిల్మ్‌ల్లో నటించింది. అంతేకాదు, ఆ మధ్య పలు వెబ్ సిరీస్‌లలో కూడా చేసింది. ఈ క్రమంలోనే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించి ‘ముద్దపప్పు ఆవకాయ్', ‘నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది. ఇవి సూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం ఆమె ‘మ్యాడ్ హౌస్' అనే సిరీస్‌ను నిర్మిస్తోంది.

Recommended Video

Alexander Movie Press Meet | Jaya Prakash Reddy | జయప్రకాష్ రెడ్డి హీరోగా 'అలెగ్జాండర్'
నాగబాబు మానసిక స్థితిపై నిహారిక కామెంట్స్

నాగబాబు మానసిక స్థితిపై నిహారిక కామెంట్స్

ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ‘అదిరింది' టీమ్‌తో ఉగాది పండుగ సందర్భంగా ‘బాబుగారి ఇంట్లో బుట్ట భోజనం' అనే స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారు. దీనికి గెస్ట్‌గా వచ్చిన నిహారిక ఓ స్కిట్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అదిరిందిలో వీళ్లు వేసే పంచులకు మా నాన్న ఇంట్లో పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు' అని కొన్ని సంఘటనల గురించి చెప్పి షాకిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X