For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైవాహిక జీవితంపై నిహారికకు నెటిజన్ ప్రశ్న: పర్సనల్ మేటర్‌పై మెగా డాటర్ ఊహించని ఆన్సర్

  |

  నిహారిక కొణిదెల.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. అద్భుతమైన టాలెంట్లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుందామె. తద్వారా బ్యాగ్రౌండ్‌తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను అందుకుంది. కెరీర్ పరంగా ఎదుగుతోన్న సమయంలో మెగా డాటర్ వివాహం జరిగిపోయింది. అయినప్పటికీ కెరీర్‌ను మాత్రం ఆపలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిహారిక సోషల్ మీడియాలో తన వైవాహిక జీవితం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  అలా పరిచయం.. ఇలా పాపులారిటీ

  అలా పరిచయం.. ఇలా పాపులారిటీ

  నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే నిహారిక ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయిన ‘ఢీ' అనే డ్యాన్స్ షోకు యాంకర్‌గా పని చేసింది. అక్కడ తనదైన హోస్టింగ్‌తో మెప్పించిన ఈ అమ్మాయి.. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. ఈ క్రమంలోనే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించిన ఆమె.. ‘ముద్దపప్పు ఆవకాయ్', ‘నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది.

  అందులో మాత్రం నిరాశనే ఎదురైంది

  అందులో మాత్రం నిరాశనే ఎదురైంది

  షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో సత్తా చాటిన నిహారిక.. అదే సమయంలో నాగశౌర్య నటించిన ‘ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇది నిరాశనే మిగిల్చింది. ఇక, ఆ తర్వాత ఈ మెగా డాటర్ ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' వంటి చిత్రాల్లోనూ లీడ్ రోల్ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేదు. దీంతో సినిమాలకు దూరం అయింది.

  గ్రాండ్‌గా చైతన్యతో నిహారిక వివాహం

  గ్రాండ్‌గా చైతన్యతో నిహారిక వివాహం

  గత ఏడాది నిహారికకు చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది. తన కుమార్తెకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని భావించిన నాగబాబు.. అందుకు అనుగుణంగానే ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో వీళ్ల పెళ్లి జరిపించారు. దీనికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అప్పట్లో ఈ వేడుక దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

  పెళ్లి తర్వాత కూడా కెరీర్ ఆపకుండా

  పెళ్లి తర్వాత కూడా కెరీర్ ఆపకుండా

  వివాహం తర్వాత కూడా నిహారిక తన కెరీర్‌ను ఆపకూడదని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఓ వెబ్ సిరీస్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో ఆమె పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందని అంటున్నారు. అలాగే, తన సొంత బ్యానర్‌పై మరో వెబ్ సిరీస్‌ను పట్టాలెక్కించింది. దీనికి మాత్రం ఆమె కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.

  అందులో బిజీగా ఉంటూ వివరిస్తోంది

  అందులో బిజీగా ఉంటూ వివరిస్తోంది

  చాలా కాలంగా నిహారిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ ఆమె తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే కెరీర్‌కు సంబంధించిన విశేషాలను కూడా వెల్లడిస్తోంది. తద్వారా సినిమాల్లో పెద్దగా నటించకున్నా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఫలితంగా ఫాలోయింగ్‌‌ను పెంచుకుంటోంది.

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
  వైవాహిక జీవితంపై షాకింగ్ ఆన్సర్

  వైవాహిక జీవితంపై షాకింగ్ ఆన్సర్

  తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఫాలోవర్లు ఆమెను వింత వింత ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘మీ వైవాహిక జీవితం ఎలా ఉంది' అని అడిగాడు. దీనికి చైతన్య కళ్లు మూసిన ఫొటోను షేర్ చేస్తూ ‘ఏమో సార్ నాకు కనబడదు' అంటూ ఊహించని రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

  English summary
  Mega Daughter Nikarika Konidela Very Active in Social Media. Now She Conducted Question And Answer Session in Instagram. In This Chit Chat She Gave Shocking Reply on Married Life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X