వైరల్ పిక్స్ : కాబోయే భర్తపై అంతలోనే ఎంత ప్రేమ.. బర్త్ డే సందర్భంగా నిహారిక ఎమోషనల్ పోస్ట్

మెగా డాటర్‌ నిహారిక కొణిదెలకు పెళ్లి కళ వచ్చేసింది. ఇన్నాళ్లు ఆమె పెళ్లిపై ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వార్తలు రాశారు. నిహారిక పెళ్లిపై మీడియానే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మెగా డాటర్‌గా నిహారికకు ఉన్న ఆ ఇమేజ్ ఎన్నో రూమర్లకు కేంద్ర బిందువైంది. ఎట్టకేలకు నిహారికకు వరుడు దొరికాడు. త్వరలోనే ఒకటి కాబోతోన్నారు కూడా. తనకు కాబోయే వరుడి ఫోటోలను నిహారిక షేర్ చేస్తూ ఎంతగా సంతోషింందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కౌగిలో బంధించేసిన నిహారిక..

కౌగిలో బంధించేసిన నిహారిక..

నిహారిక మొదటగా తనకు కాబోయే భర్త మొహాన్ని ఎవ్వరికీ చూపించలేదు. ఘాడంగా హత్తుకున్న ఉన్న ఫోటోను షేర్ చేయగా..అందులో అతని మొహాన్ని కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. అసలు ఫోటోలు షేర్ చేయడానికంటే ముందుగా ఓ చిన్న హింట్ కూడా ఇచ్చింది. అయితే అందరూ అది సినిమా అప్ డేట్ అనుకున్నారు.

నిహారిక-చైతన్య ఫోటోలు..

నిహారిక-చైతన్య ఫోటోలు..

నిహారిక తనకు కాబోయే భర్త చైతన్యను కౌగిలింతలో బంధిస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద చిచ్చునే పెట్టాయి. అతని పేరు, వివరాలు ఏంటి? అని తెలుసుకోవాలనే ఆత్రుత అందరిలోనూ పెరిగింది. దీంతో దెబ్బకు అతనికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.

పెరిగిన ఫాలోవర్స్..

పెరిగిన ఫాలోవర్స్..

చైతన్య ఓ టెక్కీ. హైద్రాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతని తండ్రి గుంటూరు ఐజీ. అయితే నిహారికతో పెళ్లి అని వార్తలు రావడంతో అతని ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్స్ వచ్చి పడ్డారు. ప్రస్తుతం అతనికి ఇన్ స్టాలో యాభై వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
కాబోయే భర్తకు విషెస్..

కాబోయే భర్తకు విషెస్..

నేడు చైతన్య బర్త్ డే. ఈ సందర్భంగా నిహారిక ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. ‘ఈ ఒక్క చిరునవ్వు రూమ్ నిండా వెలుగులు నింపుతుంది. ఆ ఒక్క హగ్ సొంత నివాసంలా అనిపిస్తుంది. నువ్వే నా సంతోషానికి చిరునామా. ప్రపంచలోనే అత్యుత్తమమైనవన్నీ పొందగలిగే అర్హత ఉన్నవాడివి. హ్యాపీ బర్త్ డే లవ్' అంటూ కాబోయే భర్తపై ప్రేమను కురిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X