నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్ : తొలిసారి అలాంటి అందాలతో మెగా డాటర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకంగా నిలుస్తుందనే చెప్పాలి. దీనికి కారణం ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడం.. అందులో కొందరు టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ స్టార్లుగా వెలుగొందడమే. అంతేకాదు, ఈ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని కూడా హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆమెనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల. చాలా కాలం క్రితమే పరిచయమైన ఈమె.. మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కానీ, సక్సెస్‌ను చేరలేదు. దీంతో కెరీర్‌కు బ్రేకిచ్చి పెళ్లి చేసుకుంది. ఇక, ఇప్పుడు మళ్లీ నిర్మాతగా ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా నిహారిక సోషల్ మీడియాలో వదిలిన ఫొటో తెగ హైలైట్ అవుతోంది. దీన్ని మీరూ చూసేయండి మరి!

చిన్న వయసులోనే సత్తా చాటి
సినిమాల్లోకి రావడానికి ముందే ఓ చానెల్‌లో ప్రసారం అయిన 'ఢీ' అనే డ్యాన్స్ షోకు నిహారిక కొణిదెల యాంకర్‌గా చేసింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించింది. ఈ క్రమంలోనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది. ఇలా చిన్న వయసులోనే సత్తా చాటింది.

హీరోయిన్‌గా ఫెయిల్ అయింది
కెరీర్ తొలినాళ్లలోనే నిహారిక యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే, హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోయింది. తన ప్రయాణంలో నాగశౌర్య నటించిన 'ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయమైన నిహారిక.. తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటివి చేసింది. కానీ, ఇవేమీ హిట్‌ను ఇవ్వలేదు.

పెళ్లి తర్వాత యమ ఎంజాయ్
వరుస పరాజయాలతో కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్న నిహారిక.. సినిమాకు గ్యాప్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను ముందుకు సాగిస్తోంది. అయితే, ఇప్పుడామె హీరోయిన్‌గా నటించకున్నా.. తన బ్యానర్‌లో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని విజయాలను కూడా సొంతం చేసుకుంది.

నిర్మాతగా కంటిన్యూ అవుతూ
తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై నిహారిక ఆ మధ్య 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ఇటీవలే 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. Z5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‌కు భారీ స్పందన దక్కింది. దీంతో ఇది తక్కువ టైంలోనే మంచి వ్యూస్‌ను దక్కించుకుని హిట్ అయింది.

సోషల్ మీడియాలో సందడిగా
మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో తరచూ హైలైట్ అవుతూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్ తక్కువే.. వాటినే
చాలా కాలంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న నిహారిక కొణిదెల.. అందాలు ఆరబోసే వాటిని మాత్రం పెద్దగా షేర్ చేయదు. కానీ, భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి తీసుకున్న పిక్స్, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. ఇందులో కొన్ని రొమాంటిక్‌వి కూడా ఉంటున్నాయి. మొత్తానికి హాట్ ట్రీట్ ఇవ్వకున్నా నిహారిక మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

టాప్ పైకి లేపిన మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో తన భర్త చైతన్యతో కలిసి జిమ్‌లో వర్కౌట్ చేసిన తర్వాత ఆమె తీసుకున్న సెల్ఫీ ఇది. ఈ పిక్‌లో నిహారిక తన టాప్‌ను పైకి లేపి చూపిస్తుంది. అలాగే, చిన్న నిక్కరుతో కనిపించింది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది తెగ వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











