జోరుగా నిహారిక కొణిదెల పెళ్లి వేడుకలు.. ప్రత్యేక విమానాల్లో చిరు, రాంచరణ్, అల్లు అర్జున్ ప్యామిలీలు.. ఫోటోలు వైరల్
మెగా డాటర్, టాలీవుడ్ హీరోయిన్ నిహారిక కొణిదెల పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాను ఇష్టపడిన చైతన్య జొన్నలగడ్డతో డిసెంబర్ 9వ తేదీన వివాహం జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో పెళ్లికి అన్ని రకాల హుంగులు పూర్తయ్యాయి. అయితే పెళ్లి కోసం మెగా, అల్లు ఫ్యామిలీ సోమవారమే అక్కడికి చేరుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో హల్దీ, పెళ్లికూతురు కార్యక్రమాలు
ఉదయ్ పూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో జరిగే పెళ్లికి ముందు హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా పెళ్లి వేడుకలు ఊపందుకొన్నాయి. ఆదివారం రాత్రి పెళ్లికి ముందు వేడుకలు జోరుగా సాగాయి. హల్దీ వేడుక, పెళ్లి కూతురు చేసే కార్యక్రమాలు కుటుంబ వేడుకగా సాగాయి.

చిరంజీవితో నిహారిక సెల్ఫీ వైరల్
ఆదివారం రాత్రి జరిగిన వేడుకకు చిరంజీవి దంపతులు, తన కూతుళ్లు సుష్మిత కొణిదెల, శ్రీజ కల్యాణ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు తన సోదరుడు చిరంజీవి, పెళ్లికూతురైన నిహారిక ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా అది వైరల్ అయింది.

నిహారిక గురించి నాగబాబు ఎమోషనల్
కూతురు నిహారిక గురించి ఈ సందర్భంగా నాగబాబు ఎమోషనల్‌గా ఓ సందేశాన్ని తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. కుటుంబ పరంగా మంచి మూలాలను అందించా. తండ్రిగా నీ ఆశలకు రెక్కలు కల్పించాను. ఆ రెక్కలకు నీ ఆశల సుదూర తీరాలను చేర్చుతుందని భావిస్తున్నా అంటూ నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు.

నిహారికతో నాగబాబు దంపతులు
ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం నూతన వధూవరులు నిహారిక, చైతన్యతో కలిసి నాగబాబు దంపతులు, చైతన్య తల్లిదండ్రులు ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్‌కు బయలు దేరారు.

ప్రత్యేక విమానంలో చిరంజీవి
ఇక చిరంజీవి కుటుంబం కూడా ప్రత్యేకమైన విమానంలో ఉదయ్‌పూర్‌కు చేరుకొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, ఉపాసన కొణిదెల ఎయిర్‌పోర్టులో మీడియా కెమెరాలకు చిక్కారు. స్పెషల్ ఫ్లయిట్‌లో ఉదయ్ పూర్‌కు చేరుకొన్నారు.

స్పెషల్ ఫ్లయిట్‌లో అల్లు ఫ్యామిలీ
నిహారిక, చైతన్య పెళ్లికి అల్లు కుటుంబ సభ్యులందరూ బయలుదేరి వెళ్లారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్‌తోపాటు కుటుంబ సభ్యులందరూ స్పెషల్ ఫ్లయిట్‌లో ఉదయ్ పూర్‌కు చేరుకొన్నారు. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యుల రాకతో వివాహ విడిది ప్రాంతం సందడి సందడిగా మారింది.

ట్రెండింగ్‌గా హ్యాష్ ట్యాగ్స్
ఇక అల్లు అర్జున్ తన భార్య, సోదరులిద్దరితో కలిసి తన టైమ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అల్లు ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ పెళ్లి కోసం #NisChay అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











