పెళ్లయ్యాక మొదటి బర్త్ డే.. గోవాలో శ్రీమతితో నిఖిల్ ఎంజాయ్!!

హీరో నిఖిలో తాను ప్రేమించిన అమ్మాయిను పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతున్నాడు. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరపుదామని ఎంతో ఆశపడ్డాడు. కానీ అనూహ్య పరిణమాలు సంభవించడం, కరోనా, లాక్ డౌన్ వంటివి అడ్డుపడటంతో పెళ్లి వాయిదా పడింది. ఇక ఎంతకీ పరిస్థితుల్లో మార్పులు రాకపోయే సరికి మే 14న కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, అత్యంత సమీప బంధువుల మధ్య ప్రేయసి పల్లవి వర్మను పెళ్లి చేసుకున్నాడు.

అలా బయటపడింది..

అలా బయటపడింది..

నిఖిల్ లవ్ స్టోరీ, రిలేషన్ షిప్‌లో ఉన్నాడని మంచు లక్ష్మీ షో ద్వారా బయటపడింది. వూడ్ అనే యాప్‌కు మంచు లక్ష్మీ ఓ టాక్ షో చేసింది. అందులో పాల్గొన్న నిఖిల్ మొదటి సారిగా తాను ప్రేమలో ఉన్నానని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నానని ప్రకటించాడు. ప్పుడూ కూడా ఎటువంటి ప్రశ్నలు అడగదని, పార్టీలకు వెళ్తానన్నా అడ్డు చెప్పదని, ఎంతో మంచిదని భార్యపై నిఖిల్ ప్రేమ కురిపించాడు.

పెళ్లి అలా..

పెళ్లి అలా..

లాక్‌డౌన్‌కు ముందు పెళ్లిని ఘనంగా నిర్వహించాలని భావించాడు నిఖిల్. కానీ కరోనా రావడంతో అంతా తారుమారైంది. అప్పటికి కూడా తన పెళ్లిని ఏదీ ఆపలేదని గుడిలోనైనా సరే అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.కానీ అది కుదరలేదు. కరోనా విస్తృతి ఎక్కువగా ఉండటంతో మే 14వరకు వేచి చూసి.. పెళ్లి చేసుకున్నాడు.

శ్రీమతి మొదటి బర్త్ డే..

శ్రీమతి మొదటి బర్త్ డే..

వివాహ బంధంతో ఒక్కటయ్యాక వచ్చిన శ్రీమతి బర్త్ డే(సెప్టెంబర్ 3)ను నిఖిల్ ఘనంగా సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు నిఖిల్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. హ్యాపీ బర్త్ డే వైఫీ.. నువ్ ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చావో అప్పటి నుంచి అంతా ఆనందమయంగానే ఉంది అంటూ నిఖల్ భార్యపై ప్రేమను చాటుకున్నాడు.

గోవాలో ఎంజాయ్..

గోవాలో ఎంజాయ్..

శ్రీమతికి బర్త్ డే విషెస్ చెబుతూ కూర్గ్‌లో దిగిన ఫోటోను షేర్ చేశాడు. కానీ తాజాగా నిఖిల్ గోవాలో ఉన్నట్టు కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. గోవాలోని తాను దిగిన హోటల్ రూం, దగ్గల్లో ఉన్న బీచ్‌ను చూపించాడు. మొత్తానికి శ్రీమతి మొదటి బర్త్ డే సందర్భంగా ఇలా టూర్ వేశాడేమో ఈ కుర్ర హీరో. నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2, 18 పేజీస్ అనే చిత్రాలతొ బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా ఈ షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X