తొక్కేయడానికి చూస్తారు.. కానీ చావు పరిష్కారం కాదు.. సుశాంత్ మృతిపై నిఖిల్ కామెంట్స్

సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. సుశాంత్ మరణించి ఇప్పటికి వారం రోజులు అవుతున్నా.. ఇంకా కొందరు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నెటిజన్లు సుశాంత్ మరణ వార్తపై తీవ దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాలీవుడ్ నెపోటిజమే సుశాంత్ ప్రాణాలను తీసిందని ఆరోపించసాగారు. సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. సామాన్య జనాలతో పాటు కొందరు సెలెబ్రిటీలు కూడా నెపోటిజాన్ని వ్యతిరేకించారు. బాలీవుడ్ పెద్దలకు వ్యతిరేకంగా గళమెత్తారు. తాజాగా యంగ్ హీరో నిఖిల్.. సుశాంత్ మృతిపై స్పందించాడు.

సుశాంత్ మృతి..

సుశాంత్ మృతి..

గత కొంత కాలం నుంచి డిప్రెషన్‌కు లోనైన సుశాంత్ గత ఆదివారం (జూన్ 14)ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాంద్రాలోని తన నివాసంలో ఉరేసుకుని ప్రాణాలను తీసుకున్నాడు. సుశాంత్ మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, సెలెబ్రిటీలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 బాలీవుడ్‌పై ఫైర్..

బాలీవుడ్‌పై ఫైర్..

సుశాంత్ మరణంపై బాలీవుడ్ నెపోటిజం ప్రభావం చూపిందని నెటిజన్లు ఆరోపించారు. బాలీవుడ్ పెద్దలు, మాఫియా అంతా కలిసి సుశాంత్‌ను ఏకాకి చేశాయని, ఆఫర్లు రాకుండా అన్నీ లాగేసుకున్నారని ఫైర్ అయ్యారు. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ కంపెనీలు సుశాంత్‌ను బ్యాన్ చేశారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టాలీవుడ్ అలా కాదు..

టాలీవుడ్ అలా కాదు..

సుశాంత్ మృతి, నెపోటిజంపై నిఖిల్ కామెంట్ చేశాడు. ఈ మేరకు నిన్న లైవ్ లోకి వచ్చిన నిఖిల్‌ను నెటిజన్లు పలు రకాలుగా ప్రశ్నించారు. అందులో నెపోటిజం, సుశాంత్ మరణంపై స్పందించమని కోరారు. టాలీవుడ్ మాత్రం తనను బాగా వెల్ కమ్ చేసిందని, బాగా ప్రోత్సహించారని, ఇక్కడైతే అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చాడు.

 ప్రతీ చోటా ఉంటుంది..

ప్రతీ చోటా ఉంటుంది..


నెపోటిజం అనేది ప్రతీ చోట ఉంటుందని, తొక్కేయడానికి చూస్తారని, అయితే మనమే కష్టపడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకూడదని, తిరిగి నిలబడాలని, విజయం సాధించాలని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా చావు మాత్రం పరిష్కారం కాదని తెలిపాడు. సుశాంత్‌కు జరిగింది బాధాకారమని పేర్కొన్నాడు.

Recommended Video

Actor Nikhil Siddhartha Dr Pallavi Varma Exclusive Marriage Video
 ఫుల్ బిజీ..

ఫుల్ బిజీ..

నిఖిల్ సిద్దార్ధ్ ప్రస్తుతం లాక్ డౌన్‌లోనూ బిజీగా ఉన్నాడు. తదుపరి ప్రాజెక్ట్ కోసం కండలు పెంచేశాడు. లాక్ డౌన్‌లోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. ఇక పర్సనల్ లైఫ్ ఫుల్ జోష్‌లో ఉండగా సినీ కెరీర్ కూడా ఊపులోనే ఉంది. కార్తికేయ 2, 18 పేజీలు అనే రెండు చిత్రాలను లైన్‌లో పెట్టేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X