నా పిల్లలు నాకు పుట్టలేదు.. వారిద్దరు అలా జన్మించారు... నీతా అంబానీ వెల్లడి

Recommended Video

Nita Ambani Says Akash And Isha Ambani Were Born Via IVF || Filmibeat Telugu

ఎవరికైనా మాతృత్వ అనుభవాన్ని పొందాలనుకొంటారు. కానీ జీవితంలో గొప్ప అనుభూతికి లోనయ్యే ఆ కోరిక నీతా అంబానీకి నెరవేరలేదట. ఇషా, ఆకాశ్ అంబానీలు నా గర్భంలో పుట్టలేదని నీతా అంబానీలు వెల్లడించడం మీడియాలో సంచలనం రేపింది. ఇషా అంబానీ పెళ్లి అనంతరం నీతా అంబానీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. నీతా ఇంటర్వ్యూ వివరాలు మీకోసం..

మాతృత్వం గురించి నీతా అంబానీ

మాతృత్వం గురించి నీతా అంబానీ

బాల్యంలో మాతృత్వం గురించి పేజీలు పేజీగా వ్యాసాలు రాశాను. జీవితంలో నాకు తల్లి పాత్ర అంటే చాలా గౌరవం. నా జీవితంలో తల్లిని కావాలనే క్షణాల కోసం ఎదురుచూశాను. నా పెళ్లి తర్వాత కొన్నేళ్లకు ఓ భయంకరమైన విషయాన్ని డాక్టర్లు చెప్పారు. నాకు 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నీవు ఎప్పటికీ తల్లివి కాలేవు అని చెప్పడంతో షాక్ గురయ్యాను.

కవల పిల్లలుగా ఆకాశ్, ఇషా అంబానీ

కవల పిల్లలుగా ఆకాశ్, ఇషా అంబానీ

తల్లివి కాలేవని వైద్యులు చెప్పిన విషయాల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాను. ఆ సమయంలో ఫిరుజా పారిక్ అనే డాక్టర్‌ను సంప్రదించాను. దాంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా ఆకాశ్, ఇషాకు జన్మనిచ్చాను. వారిద్దరూ కవలపిల్లలుగా జన్మించడంతో సంతోషంలో మునిగిపోయాను అని నీతా అంబానీ తెలిపారు.

ఆనంద్ పిరమిల్‌తో ఇషా వివాహం

ఆనంద్ పిరమిల్‌తో ఇషా వివాహం

ఇటీవల ఇషా అంబానీ వివాహం ఆనంద్ పిరమల్‌తో జరిగిన సంగతి తెలిసిందే. తన పెళ్లి అనంతరం వోగ్స్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. తాను, ఆకాశ్ ఐవీఎఫ్ ద్వారా జన్మించిన కవల పిలల్లం అని చెప్పారు. తన తల్లి తొలుత గృహిణిగా ఉండాలని భావించారు. కానీ మేము ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు వ్యాపార బాధ్యతలు మీద పడటంతో మాకు కొంత దూరంగా ఉన్నారు. ఇంట్లో అమ్మ పులిలా ఉంటుంది అని ఇషా చెప్పారు.

అమ్మ ఇంట్లో చాలా స్ట్రిక్టు

అమ్మ ఇంట్లో చాలా స్ట్రిక్టు

మాది సంపన్న కుటుంబమైనా.. మా ఇంట్లో అమ్మ, నాన్న గొడవ పడటం చూశాం. అమ్మ చాలా స్ట్రిక్టు. మేము స్కూల్ ఎగ్గొట్టాలని ప్రయత్నిస్తే ఊరుకొనేది కాదు. ఆడుకొనే సమయంలో ఆటలకు, చదువుకునే సమయంలో చదువుకు ప్రధాన్యం ఇవ్వాలని చెప్పేవారు అని ఇషా అంబానీ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X