TFI Fans Cricket League: నితిన్ ఫ్యాన్స్ జట్టు విజృంభణ.. కుప్పకూలిన రవితేజ ఫ్యాన్స్ టీమ్!
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్ క్రికెట్ (TFI Fans Cricket League) లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో రవితేజ ఫ్యాన్స్‌కు చెందిన క్రికెట్ జట్టు టీమ్ ఈగల్ కుప్పకూలింది. హీరో నితిన్ జట్టుతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న టీమ్ ఈగిల్ జట్టు బ్యాట్స్‌మెన్ చేతులెత్తయ్యడంతో టోర్నిలోనే అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న టీమ్ ఈగిల్ జట్టు తరఫున మని, వాలెటి జగన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే ఇద్దరు పరుగులేమి చేయకుండా డకౌట్ అయి వెను తిరిగారు. స్కోరు బోర్డుపై 2 పరుగులకే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. మణి, వాలేటి జగన్ సున్నా పరుగులకే పెవిలియన్ చేరారు.

ఆ తర్వాత శ్రేయాస్, రాకేష్, సాయిరాం రెండెంకెల స్కోరు చేయకుండానే అవుటయ్యారు. ఓ దశలో 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో కోలుకోలేకపోయింది. మొత్తంగా 14.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. జట్టులో అత్యధికంగా రాజు 17 పరుగులు చేశాడు. తమ్ముడి ఎలెవన్ జట్టులో 3.4 ఓవర్లు వేసి 3 పరుగులు ఇచ్చి మారుఫ్ 5 వికెట్లు తీసుకొన్నాడు. సాయి, రాజేష్, కేకే, విక్రమ్ చెరో వికెట్ తీసుకొన్నారు.
ఇక నితిన్ టీం బ్యాటింగ్ ప్రారంభించి ధాటిగానే ఆడింది. 5.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 53 పరుగుల చేసి విజయాన్ని సొంతం చేసుకొన్నది. రాఘవ అమ్మిరెడ్డి 37పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అజయ్ 3 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ధర్మ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

TFI Fans Cricket League టోర్నిలో రవితేజ ఫ్యాన్స్ జట్టు టీమ్ ఈగిల్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు విఫలమవ్వడంతో ఈ టోరీలోనే అత్యంత తక్కువ స్కోరు సాధించిన టీమ్‌గా రికార్డు క్రియేట్ చేసింది. నితిన్ టీం విజయంతో మరింత ఉత్సాహంతో ఉన్నది.


Click it and Unblock the Notifications











