For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంతకీ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశావ్.. సాయి ధరమ్ తేజ్‌ పెళ్లి గుట్టువిప్పిన నితిన్!!

    |

    టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. ఈ ఏడాదిలో వరుసగా బ్యాచ్‌లర్ హీరోలందరూ పెళ్లి పీఠలెక్కతున్నారు. నిఖిల్, నితిన్, రానా వంటి హీరోలు పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. అయితే ఈ మూడు పెళ్లిల్లలో ఓ కామన్ పాయింట్ ఉంది.అందరిది ప్రేమ పెళ్లే. తాము ఇష్టపడ్డ అమ్మాయి మెడలోనే తాళి కట్టారు. అయితే మరో బ్యాచ్‌లర్ వికెట్ పడిపోయేందుకు రెడీగా ఉంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు కూడా పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

    గత కొన్ని రోజులుగా సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అమ్మాయిని కూడా చూశారని, మెగాస్టార్ చిరంజీవి కూడా ఓకే చెప్పేశాడని ఇక వచ్చే ఏడాదిలోనే పెళ్లి అంటూ టాక్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. నేటి సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా కొందరు చేసిన ట్వీట్లతో తేజు పెళ్లి వార్తలపై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. మరీ ముఖ్యంగా నితిన్ నేరుగా అడిగేశాడు. దీనికి తేజు ఇచ్చిన రిప్లై కూడా అదిరిపోయింది.

    Nithin Reveals Secret Of Sai Dharam Tej marriage

    హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. లాస్ట్ బ్యాచ్‌లర్ బర్త్ డే పార్టీని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకో.. ఇంతకి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశావ్.. అంటూ డైరెక్ట్‌గా ప్రశ్నించాడు. ఇక నితిన్ ట్వీట్‌కు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ బర్త్ డే విషెస్‌కు బదులుగా థ్యాంక్స్ డార్లింగ్ అంటూ బదులిచ్చాడు. ఇక డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశావ్ అన్న ప్రశ్నకు రియాక్ట్ అవుతూ.. అంత ప్రెజర్ నేను తీసుకోలేను.. ఇంట్లో వాళ్లు ఎప్పుడంటే అప్పుడు అని నవ్వేశాడు. మొత్తానికి ఈ సుప్రీం హీరోకు పెళ్లి ఫిక్స్ అయిందని అందరికీ తెలిసిపోయింది. ఇక అమ్మాయి ఎవరన్నది తెలియాల్సి ఉంది.

    English summary
    Nithin Reveals Secret Of Sai Dharam Tej marriage, Many manyy happy returns of the day darling.. hv a great last bachelor bday!! Inthaki date eppudu fix chesav
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X