పవన్ కళ్యాణ్‌తో అందుకు సిద్దమే.. ఆయన పిలిస్తే వెళ్తా.. ‘నగ్నం’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

కరోనా వైరస్ వల్ల ఎవరు ఎంత నష్టపోయారో గానీ రామ్ గోపాల్ వర్మ, ఆయన ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన స్వీటీ (శ్రీ రాపాక) మాత్రం బోలెడంత లాభపడ్డారు. ఆర్థికంగా ఆర్జీవీకి నగ్నం సినిమా మంచి లాభాలను తెచ్చిపెడితే.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కంటే శ్రీ రాపాకే అందరికీ ఎక్కువగా తెలిసింది. నగ్నంలో శ్రీ రాపాక కనిపించిన తీరుకు యూత్, మిడిల్ ఏజ్ వారంతా ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతో ఎవగ్రీన్ స్టార్‌గా మారిపోయింది. సినిమాతో ఇంతగా ఫేమస్ అయితే ఆమె ఇంటర్వ్యూలు, బోల్డ్ కామెంట్లతో మరింత సంచలనం సృష్టించింది.

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో..

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో..

శ్రీ రాపాకకు తెలుగు ఇండస్ట్రీ ఏమీ కొత్త కాదు. దాదాపు గత పదేళ్ల నుంచీ ఇండస్ట్రీలో ఉంటోంది. అయితే ఇంత వరకు తెర మీద కనిపించలేదు. వలయం అనే చిత్రంలో ఓ చిన్న పాత్ర చేసిన శ్రీ.. నిజానికి ఓ ఫ్యాషన్ డిజైనర్. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్‌లో తాను ఒకరని శ్రీ చెప్పుకొచ్చింది.

ఆ గ్యాంగ్‌తో క్లోజ్..

ఆ గ్యాంగ్‌తో క్లోజ్..

ఇండస్ట్రీలో అన్ని ప్రొడక్షన్ హౌస్‌లు, నిర్మాతలు, డైరెక్టర్స్ తెలుసని దాదాపు 50కి పైగా చిత్రాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేశానని తెలిపింది. అంతే కాకుండా హీరోల్లో ఒకప్పుడు నాని, విజయ్ దేవరకొండ, తనీష్ చాలా క్లోజ్ అని డైరెక్టర్స్‌లో చంద్ర సిద్దార్థ బాగా దగ్గరని తెలిపింది.

పవన్ కళ్యాణ్ అంటే క్రష్..

పవన్ కళ్యాణ్ అంటే క్రష్..

తనకు హీరోల్లో పవన్ కళ్యాణ్ అంటే క్రష్ అని చెప్పుకొచ్చింది. అయితే మొదట్లో పవన్‌ను కలవాలని ఓ రెండు మూడు సార్లు ప్రయత్నాలు కూడా చేసిందంటా. కానీ కుదరక పోవడంతో ఆ ప్రయత్నాలను విరమించుకుందంటా. తనకు ఎవ్వరినీ అడగటం ఇష్టముండదని, కలవాలని ఉంటే కలుస్తామని చెప్పుకొచ్చింది.

Recommended Video

Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
పిలిస్తే వెళ్తా..

పిలిస్తే వెళ్తా..

పవన్ కళ్యాణ్‌తో డేటింగ్‌‌కు వెళ్లాలనుకుంటున్నానని, ఆయన పిలిస్తే వెళ్తానని నిర్మొహమాటం చెప్పుకొచ్చింది. ఎవరితోనైనా నటించాలని ఉందా అని అడిగితే.. పవన్ కళ్యాణ్‌తోనే నటించాలని ఉందని తెలిపింది. ఇంకా ఈ భామ సెక్స్ గురించి, డేటింగ్ గురించి చెప్పిన బోల్డ్ సమాధానాలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X