'బాహుబలి' భామకు ఎంత ధైర్యం.. వైరల్ అవుతున్న వీడియో
నోరా ఫతెహి.. ఈ పేరు చెబితే గుర్తు పట్టడం కాస్త కష్టమే గానీ, బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్‌తో మెలికలు తిప్పిన బ్యూటీ అంటే అందరికీ స్ట్రైక్ అవుతుంది. ఆమె చేసిన ఓ ఫీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మండుతున్న నిప్పు రాడ్లను చేతిలో పట్టుకొని.. గుండ్రంగా తిప్పుతూ ఆమె చేసిన డాన్స్ అబ్బో అనేలా ఉంది. నాజూకు నడుమును అలా మెలికలు తిప్పుతూ నిప్పుతో ఈ రకమైన ఫీట్స్ చేయడమంటే అంత సులువు కాదు. అలాంటి అరుదైన ఫీట్ చేసిన నోరా ఫతెేహి ఓ పక్క చేతులు కాలుతున్నా కూడా ఎంతో ఓర్పుతో ఈ డాన్స్ చేసింది.
ఐటెం భామగా పేరొందిన నోరా ఫతెహి, గతంలో ఎన్టీఆర్ తో కలిసి 'టెంపర్' సినిమాలో రెచ్చిపోయి డాన్సులు వేసింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి'లో ప్రభాస్‌తో కలిసి 'మనోహరి' అనే పాటలో మరో ఇద్దరు భామలతో కలిసి హుషారెత్తించింది. ఐటెం భామగా వెండితెరపై వెలుగుతున్న ఈమె.. ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లో తనదైన శైలిలో దూసుకుపోతుంది. రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'భారత్'సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసి బీ టౌన్ ఆడియన్స్‌ని గిలిగింతలు పెట్టింది నోరా.

కాగా నిప్పుతో ఆమె చేసిన తాజా ఫీట్ చూసి ఆశచయపోయారు నెటిజన్లు. ఆన్ స్క్రీన్ పైనే కాదు, ఆఫ్ స్క్రీన్ పైన కూడా నోరా టాలెంట్ మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. అవుట్ స్టాండింగ్, అమేజింగ్ పెరఫార్మెన్స్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











