విజేత సినిమాకు చిరంజీవి ఫస్ట్ ఛాయిస్ కాదా? ఆ మూవీని మిస్ చేసుకొన్న హీరో ఎవరో తెలుసా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి దిగ్గజ హీరోల జాబితాలో తరాలు మారినా వినిపించే అతికొన్ని పేర్లలో టాలీవుడ్ శిఖరంలాంటి నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. మరి ఇప్పుడు ఇంత స్టేజ్ లో ఉండడానికి కారణం తన కఠోర కష్టం నటుడుగా రాణించాలని తపన తనని మెగాస్టార్ గా నిలబెట్టి ఎన్నో అవార్డులు రివార్డులు రికార్డులు తెచ్చి పెట్టాయి.

కాగా ఇప్పటికి కూడా మెగాస్టార్ పేరిట ఆల్ టైం రికార్డ్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. మరి బహుశా తన కెరీర్ స్టార్టింగ్ నుంచి తన తరం నటులు నుంచి ఇప్పుడు తరం స్టార్ హీరోస్ కి కూడా మార్కెట్ లో పోటి ఇచ్చిన ఏకైక హీరో కూడా ఒక్క మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. కాగా చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ సెన్సేషనల్ హిట్స్ కూడా ఉన్నాయి.

Not chiru akkineni nagarjuna is 1st choice for emotional sports drama

అయితే చిరుని చాలా మంది ఒక మాస్ హీరో, ఎంటర్టైన్మెంట్ జానర్ లోనే చూస్తారు కానీ చిరు వీరభిమానులకి మాత్రమే తెలుసు తన క్యాపబలిటీ ఏంటి అనేది. అలా చిరు కెరీర్లో మాస్ పాత్రలు ఎంటర్టైనింగ్ రోల్స్ మాత్రమే కాదు హత్తుకునే ఎమోషనల్ పాత్రలు కూడా ఎన్నో చేశారు. అలా చిరంజీవి చేసిన కొన్ని ఎమోషనల్ డ్రామా లలో అప్పట్లో చిరుతో ఎన్నో సెన్సేషనల్ మాస్ హిట్స్ చేసిన దర్శకుడు కోదండ రామిరెడ్డి చేసిన ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం "విజేత" కూడా ఒకటి.

మరి చిరు ఇందులో ఇక ఫుట్ బాల్ ప్లేయర్ రోల్ లో కనిపించగా తన కుటుంబ పరిస్థితులు రీత్యా తన కలకి దూరం అయ్యి ఒక హృదయ విధారక నిర్ణయం తీసుకునే యువకుడి పాత్రలో భావోద్వేగానికి లోను చేసే పాత్రలో కనిపిస్తారు. అయితే ఈ పాత్రలో చిరు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి పూర్తి న్యాయం కూడా చేసేసారు.

కాగా ఈ సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన నిజం ఏమిటో తెలుసా? అసలు ఈ సినిమాకి హీరోగా మొదటిగా చిరంజీవిని అనుకోలేదట. 1985లో విడుదల అయ్యిన ఈ సినిమాని మొదటిగా చిరుతో కాకుండా అప్పటి సీనియర్ నటుడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు వారసుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునతో ప్లాన్ చేసారట.

Not chiru akkineni nagarjuna is 1st choice for emotional sports drama

కానీ అప్పుడు పలు కారణాలు చేత ఈ సినిమా నాగార్జున చేయలేదు. ఆ తర్వాతే చిరంజీవి దగ్గరకి వచ్చిందట. సో ఇలా ఆ ఎమోషనల్ సినిమాలో నాగార్జున చేయాల్సింది చిరంజీవి చెంతకు చేరింది. ఇప్పుడు అంటే ఇలాంటి సినిమాలు ఏమో కాని ఆ యంగ్ ఏజ్ లో మాత్రం ఆ సినిమా చిరు కాకుండా నాగార్జున చేసినా సెట్టయ్యిపోయి ఉండేది అని చెప్పొచ్చు.

ఆ ఎమోషనల్ డ్రామాకి నాగ్ కూడా తన మార్క్ పెర్ఫార్మన్స్ చూపించే వారు. ఇక ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు తారలు మంచి స్నేహ బంధంతో లైఫ్ ని లీడ్ చెస్తూ తెలుగులో ప్రెజెంట్ తరానికి కూడా తమ సత్తా చూపిస్తున్నారు. కాగా నాగార్జున పలు పాన్ ఇండియా చిత్రాల్లో సాలిడ్ సపోర్టింగ్ రోల్స్ సహా హీరోగా సిల్వర్ స్క్రీన్ పై అలాగే స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ షో హోస్ట్ గా కొనసాగుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి భారీ సినిమా "విశ్వంభర" లో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Read more about: nagarjuna chiranjeevi vijetha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X