RRR మూవీకి ఫస్ట్ ఛాయిస్ చరణ్, ఎన్టీఆర్ కాదా? ఆ ఇద్దరు హీరోలకు కథ చెప్పాడా?
ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దూపొందించిన మాస్ మల్టీస్టారర్ చిత్రం "ఆర్ ఆర్ ఆర్" అనే చెప్పాలి. మరి జక్కన్న నుంచి బాహుబలి 2 లాంటి సినిమా తర్వాత ఎలాంటి సినిమా వస్తుంది అనేది చర్చకే దారి తీయగా ఈ మెగా నుంచి ఒక స్టార్ నందమూరి నుంచి ఒక స్టార్ తో కలలో కూడా ఊహించని కాంబినేషన్ ని సెట్ చేసి రాజమౌళి ఔరా అనిపించారు.
కాగా ఈ భారీ సినిమా విడుదల అయ్యి రికార్డు వసూళ్లు కొట్టడం ఆస్కార్ ని కూడా ఇండియాకి తీసుకురావడంతో తెలుగు సినిమా సహా ఇండియన్ సినిమాని గ్లోబల్ స్థాయిలో నిలబెట్టింది. అయితే ఓ షాకింగ్ ట్విస్ట్ ఈ సినిమా విషయంలో వైరల్ గా ఇప్పుడు మారింది. ఈ చిత్రానికి రామరాజుగా చరణ్ ని కొమరం భీం గా ఎన్టీఆర్ ని రాజమౌళి అండ్ టీం మొదటగా అనుకోలేదా అన్న ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ చేసిన కామెంట్స్ ఇప్పుడు RRR సినిమా మెయిన్ లీడ్ పై ప్రశ్నలు రేపుతున్నాయి. గతంలో ఒకసారి రాజమౌళి తనకి (కార్తీకి) తనని తన అన్నయ్య సూర్యని పెట్టి ఓ మల్టీ స్టారర్ చేయడంపై ఒక ఐడియా షేర్ చేసుకున్నారని కార్తీ రివీల్ చేసాడు. దీనితో ఆ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమానే అంటూ టాక్ మొదలైంది.
అయితే కార్తీకి ఈ ఐడియా RRR సినిమా మొదలు పెట్టడం కంటే ముందే చెప్పారట. సో మరి ఆ సినిమా ఈ సినిమా ఒకటేనా కాదా అనేది మాత్రం జక్కన్నకే తెలియాలి అంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కాగా మరికొందరు అయితే ఈ స్క్రిప్ట్ వేరు ఆ స్క్రిప్ట్ వేరు అంటున్నారు. మరి రాజమౌళి అన్నతమ్ములు సూర్య, కార్తీతో అనుకున్న ఐడియా ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఇపుడు RRR స్టార్ ఎన్టీఆర్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం "దేవర" తో పోటీగా కార్తీ నటించిన చిత్రం "సత్యం సుందరం" పోటీకి రాబోతుంది ఇందులో మరో ముఖ్య పాత్రలో అరవింద స్వామి కూడా నటిస్తున్నారు. మరి దేవర లాంటి భారీ సినిమా ఉన్నా కూడా క్లాష్ కి రావడం అంటే సాహసమే అని చెప్పాలి.

ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే సంచలన దర్శకుడు గేమ్ చేంజర్ తో డిసెంబర్ రిలీజ్ కి రాబోతుండగా జక్కన్న మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇండియా లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్న ఈ చిత్రం వచ్చే స్టార్ట్ చేసుకోనున్నట్టు తెలుస్తుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాకి కొత్త లుక్ ని ప్రిపేర్ చేస్తున్నారు. కాగా జక్కన్న నెక్స్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కూడా చాలా మంది స్టార్స్ నటిస్తారని వినికిడి.


Click it and Unblock the Notifications











