రామ్ చరణ్ అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు: ఉపాసన
రామ్ చరణ్, ఉపాసన పెళ్లైన కొత్తలో అభిమానుల్లో చాలా సందేహాలు మొలకెత్తాయి. రామ్ చరణ్ ఆమెనే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అనే ప్రశ్న చాలా మంది నుంచి వినిపించింది. కానీ సరైన సమాధానం ఇప్పటి వరకు రాలేదు. ఎట్టకేలకు 7 సంవత్సరాల తర్వాత ఉపాసన స్వయంగా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన ఆఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రకృతి ప్రేమికులైన ఇద్దరూ టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో విహరిస్తూ వైల్డ్ లైఫ్ ఆస్వాదిస్తున్నారు. ఆదివారం సింహం పిల్లలతో ఆడుకుంటున్న ఫోటో పోస్ట్ చేసిన ఆమె ఆసక్తికర విషయం వెల్లడించారు.

మిస్టర్ సి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఇప్పుడు తెలుస్తుంది
‘మిస్టర్ సి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఆఫ్రియా పర్యటన నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. తల్లి లాంటి ప్రకృతికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అడవి నుంచి నేర్చుకోవాల్సింది, గ్రహించాల్సింది చాలా ఉంది. చిన్న మార్పులే రేపు పెద్ద తేడాకు కారణం అవుతుంది. అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.

ఉపాసన వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏమిటి?
చరణ్‌కు జంతువులు, ప్రకృతి అంటే చాలా ఇష్టం. తన ఫాం హౌస్‌లో కొన్ని యానిమల్స్‌ను స్వయంగా పెంచుకుంటున్నాడు. ఉపాసన మనస్తత్వం కూడా దాదాపు అలాంటిదే. ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు, మనసులు కలిశాయి. చిన్నతనం నుంచి ఉన్న స్నేహం కూడా వీరు పెళ్లి ద్వారా ఒక్కటవ్వడానికి కారణం. ఇదే ఉపాసన వ్యాఖ్యల వెనక అంతరార్థమేమో?

డేరింగ్ లేడీ ఉపాసన
ఉపాసన ధైర్యవంతురాలైన మహిళ. ఆ ధైర్యమే ఆమెను వ్యాపార రంగంలో దూసుకెళ్లేలా చేస్తోంది. ఆమె సింహం పిల్లలతో ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ రామ్ చరణ్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వెడ్డింగ్ యానివర్శరీ స్పెషల్
సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం జూన్ 14న చరణ్, ఉపాసన వివాహం జరిగిన సంగతి తెలిసిందే. RRR షూటింగులో జాయిన్ అయితే వెకేషన్ ఎంజాయ్ చేయడానికి సమయం ఉండదు కాబట్టి ముందుగానే చరణ్ ఇలా తమ వెడ్డింగ్ యానివర్శరీ వెకేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











