బాలయ్య లెక్క తేలుస్తాడా? నందమూరి ఫ్యాన్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఎన్టీఆర్ బయోపిక్ మిస్ అయితే...
టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు ముస్తాబైంది. ఈ చిత్రం తొలిపార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న రిలీజ్ కానున్నది. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తొలిరోజు వసూళ్ల ఎంత ఉండవచ్చనే అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా 1000కిపైగా
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రం 600 స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. అలాగే బెంగళూరు, ఇతర పాంత్రాల్లో 225 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 275 స్క్రీన్లలో ఎన్టీఆర్ కథానాయకుడు ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 1110 స్క్రీన్ల మేర ప్రదర్శించనున్నారు.

తొలిరోజు అంచనాలు ఇలా
ఎన్టీఆర్ బయోపిక్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసే మొత్తంపై ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంచనాల ప్రకారం తొలిరోజున ఈ చిత్రం రూ.20 కోట్లకుపైనే వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగాయి. దాంతో తొలి రోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదు.

టాలీవుడ్ తొలిరోజు రికార్డులు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలను పరిశీలిస్తే.. బాహుబలి2 చిత్రం రూ.14.9 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత అరవింద సమేత 11.25 కోట్లు, బాహుబలి 11.15 కోట్లు, జై లవకుశ 9.4 కోట్లు, జనతా గ్యారేజ్ రూ.9.2 కోట్లు, అజాతవాసి చిత్రం రూ.8.8 కోట్లు, ఖైదీ నంబర్ 150 చిత్రం 8.6 కోట్లు, రంగస్థలం రూ.7.8 కోట్లు వసూలు చేశాయి. అయితే ఈ రికార్డులను ఎన్టీఆర్ బయోపిక్ అధిగమిస్తుందా అనే అంశం చర్చనీయాంశమైంది.

బాలకృష్ణ కెరీర్‌లోనే తొలి
ఇక నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఓ రికార్డు కానున్నది. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లో వందకోట్లకు చేరువైన సినిమాలేదు. జైసింహ మాత్రమే వసూళ్ల పరంగా రూ.50 కోట్లు దాటింది. ఈ చిత్రం గ్యారెంటీగా రూ.100 కోట్లు దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











