సరికొత్తగా ఎన్టీఆర్.. ఆన్‌లైన్ వేదికల్లో వైరల్ పిక్
ఇప్పుడున్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న ఎన్టీఆర్ వరుస సినిమాలతో అలరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ టైగర్‌తో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు దర్శకనిర్మాతలు. ఇక నందమూరి ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్‌పై అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ అభిమాని ఎన్టీఆర్ ఫొటో రూపొందించి ఫేస్‌బుక్ వేదికగా పంచుకోవడంతో అది కాస్త వైరల్ అయింది. ఎన్టీఆర్ మీదున్న అభిమానంతో ఆయన సినిమా పేర్లను జత చేస్తూ తారక్ ఫోటోను ఎడిట్ చేశాడు ఆ అభిమాని. ప్రస్తుతం ఆన్‌లైన్ వేదికలపై తెగ చెక్కర్లు కొడుతున్న ఈ ఫొటో చూసి మురిసిపోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. గతంలో కూడా ఇలాగే ఎన్టీఆర్‌కి సంబంధించి పలు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న RRR లో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అలరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. చిత్రంలో ఆలియా భట్ సహా పలువురు బాలీవుడ్ తారలు నటిస్తున్నారు.
RRRలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా, ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఈ సినిమాపై ఇటు నందమూరి అటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ జులై 30న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











