కారు డ్రైవర్‌తో తిట్లు తిన్న రాజమౌళి.. అసలు విషయం బయటపెట్టిన ఎన్టీఆర్

భారతీయ సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR సినిమా ప్రమోషన్స్ కోసం మూవీ యూనిట్ దేశవ్యాప్తంగా పర్యటించారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్, స్టార్ హీరోయిన్ అలియాభట్‌తో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముంబై, చెన్నై నగరాల్లో విస్తృతంగా పర్యటించారు. జాతీయ ఛానెల్‌లో పాపులర్ కామెడీ షో ది కపిల్ శర్మ షోలో చిత్ర యూనిట్ పాలొన్నారు. ఈ సందర్బంగా రాజమౌళికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలు ఏమిటంటే..

Recommended Video

RRR Moivie : Ram Charan Is Calm But Jr NTR Is A Tsunami - SS Rajamouli | Filmibeat Telugu
ఏనుగుపై వస్తారని అనుకొంటే...

ఏనుగుపై వస్తారని అనుకొంటే...

బాహుబలి నిర్మించిన ఎస్ఎస్ రాజమౌళి స్వాగతం పలుకుతూ.. మీరు వస్తున్నారంటే.. పెద్ద ఏనుగుపై ఎంట్రీ ఇస్తారనుకొంటే.. మీరు ఇలా సాదాసీదా వచ్చారు. మీరు సింపుల్‌గా ఉంటారా? లేక ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు కంటపడకుండా ఉండటానికి సింపుల్‌గా కనిపిస్తారా అని అడిగారు. దాంతో ముసిముసి నవ్వులు నవ్వుతూ సింపుల్‌గా ఉండటమే ఇష్టం అని రాజమౌళి సమాధానం ఇచ్చారు.

అందుకే RRR టైటిల్ పెట్టాను

అందుకే RRR టైటిల్ పెట్టాను

RRR అని టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి? లేదా రూపాయలు.. రూపాయలు.. రూపాయలు సంపాదించాలని ఈ టైటిల్ పెట్టారా? అని కపిల్ శర్మ అడిగితే.. సినిమా ప్రారంభమైనప్పుడు ఏం టైటిల్ పెట్టాలో తెలియలేదు. అయితే రాంచరణ్, రామారావు, రాజమౌళి ముగ్గురి పేర్లు తెలిసే విధంగా RRR అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాం. అది పాపులర్ అయి.. ప్రేక్షకులు కూడా ఆమోదించడంతో దానినే టైటిల్‌గా ఖరారు చేశాం అని రాజమౌళి సమాధానం ఇచ్చారు.

ఈగను వెంటపెట్టుకొని వెళ్లారట కదా..

ఈగను వెంటపెట్టుకొని వెళ్లారట కదా..


ది కపిల్ శర్మ టీమ్‌లోని కమెడియన్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని ఆటపట్టిస్తూ.. మీరు ఈగ ప్రమోషన్స్ కోసం ఒక ఈగను వెంటపెట్టుకొని వెళ్లారట.. అప్పుడు మీ ఈగకు తోడుగా మరో నాలుగు ఈగలు వచ్చాయట.. అందులో మీ ఈగను ఎలా పట్టుకొన్నారంటే.. ఆయన నవ్వుల్లో మునిగిపోయారు. ఈగ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

 ఈగపై జక్కన విస్తృత పరిశోధన

ఈగపై జక్కన విస్తృత పరిశోధన

ఈగ సినిమా షూటింగుకు ముందు ఒక సీసాలో చాలా ఈగలను బంధించి వాటిపై పరిశోధన చేశారు. ఈగలకు మత్తు మందు ఇచ్చి వాటి కదలికలు, వాటి గురించి క్షణ్ణంగా చేశారు. ఈగ సినిమా షూటింగు సమయంలో సీసా నిండా ఈగలను నింపి ఫ్రిజ్‌లో దాచుకొనే వారు అని రాజమౌళి గురించి ఎన్టీఆర్ పలు విషయాలు వెల్లడించారు.

రాజమౌళిపై కారు డ్రైవర్ కోపం

రాజమౌళిపై కారు డ్రైవర్ కోపం

అయితే ఈగ సినిమా తీసిన తర్వాత నా కారు డ్రైవర్ నాపై సీరియస్ అయ్యారని ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. ఈగ, జంతువులు, కీటకాలపై ఇక సినిమాలు మానేసి మనుషులతో సినిమాలు తీయండి అంటూ గట్టిగా నాకు నా డ్రైవర్ క్లాస్ పీకాడు. అయితే నా కారు డ్రైవర్ బాధపడటం చూసి ప్రేక్షకుల్లో సినిమాపై ఇంత అభిమానం, నాపై ఇంత ప్రేమ ఉంటుందా అనే విషయం నాకు స్పష్టమైంది అని రాజమౌళి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X