Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
ఒక్కడు సినిమాలో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా? దెబ్బకు నెంబర్ మార్చేశాడు
ఒక సినిమా సినీ తారల జీవితాల్లో మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఇక ఒక్కడు సినిమా కూడా అందులో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం. ఆ సినిమాతోనే టెక్నీషియన్స్ యాక్టర్స్ జీవితాలు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నాయి. ఇక ఆ సినిమాలో ఉండే హైలెట్ కామెడీ సీన్ లలో పాస్ పోర్ట్ ఆఫీసర్ ని విసిగించే సీన్ ఎవ్వరు మార్చవిపోలేరు. ఇక థియేటర్స్ లోనే ఆ ఫోన్ నెంబర్ ని నోట్ చేసుకున్న ఆడియెన్స్ గ్యాప్ లేకుండా కాల్స్ కూడా చేశారట. ఆ ఫన్నీ మూమెంట్ పై ఒక లుక్కేస్తే..
ఆ ఒక్క సినిమాతో..
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, భూమిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఒక్కడు సినిమా 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకుముందు వరకు మహేష్ బాబు అంటే కేవలం ఒక క్లాస్ హీరోనే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఒక్కడు విడుదలైందో మహేష్ మాస్ దశ మారిపోయింది. మరో బాక్సాఫీస్ హీరో సరికొత్తగా అవతరించడాని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ..
సినిమాలో కొండా రెడ్డి బురుజు సీన్, అలాగే చార్మినార్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, లవ్ ట్రాక్స్... ఇలా ప్రతి ఒక్కటి సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా అందులో పాస్ పోర్ట్ ఆఫీసర్ గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం పండించిన కామెడీ చాలా న్యాచురల్ గా ఉంటుంది.
ఆ ఫోన్ నెంబర్ ఎవరిదంటే..
హీరోయిన్ పాస్ పోర్ట్ కోసం హీరో తన స్నేహితులతో కలిసి పాస్ పోర్ట్ ఆఫీసర్ కి విసుగు తెప్పిస్తారు. 9848032919 అంటూ కమెడియన్ చెప్పిన ఫోన్ నెంబర్ ని నోట్ చేసుకొని ఆతనికి విసుగు తెప్పించేలా మహేష్ గ్యాంగ్ సభ్యులు చిరాకు తెప్పిస్తారు. ఇక ఫైనల్ గా అతను చిరకుతోనే పాస్ పోర్ట్ వారి ముందు పడేస్తాడు. ఆ విధంగా ఆ సీన్ హైలెట్ గా నిలిచింది.
దెబ్బకు నెంబర్ మార్చేశాడు..
ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని పలు మార్లు చెప్పిన ఆ ఫోన్ నెంబర్ మరెవరిదో కాదు. ఒక్కడు చిత్ర నిర్మాత యమ్‌ఎస్.రాజు గారిదే. సినిమా షూటింగ్ ఏండింగ్ ఈ సీన్ ని చిత్రీకరించారట. ఇక సరదాగా దర్శకుడు ఎదో ఒక నెంబర్ చెప్పవద్దని రాజుగారి నెంబర్ ని వాడేశారట. దీంతో ఆ నెంబర్ కి అప్పట్లో లక్షల్లో ఫోన్ కాల్స్ రావడంతో దెబ్బకు నిర్మాత నెంబర్ చేంజ్ చేసారట.
Recommended Video
గోపిచంద్ చేయాల్సిన ఆ పాత్రలో..
చిత్ర యూనిట్ లో ప్రతీ ఒక్కరికి ఆ సీన్ చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. ఇక ఆ సినిమా సెట్స్ పైకి వచ్చిన తరువాత చాలా మార్పులే జరిగాయి. నిజానికి ప్రకాష్ రాజ్ చేసిన ఓబుల్ రెడ్డి విలన్ పాత్రలో మొదట గోపిచంద్ ని అనుకున్నారు. కానీ అప్పటికే మహేష్ బాబుతో నిజం సినిమాలో గోపిచంద్ విలన్ గా ఓకే అయ్యాడు. దీంతో మహేష్ నిర్ణయం మేరకు ప్రకాష్ రాజ్ ని సెలెక్ట్ చేసుకున్నారు.